
చైనాకు షాక్ కొడుతున్న వరుస పరాజయాలు?
మొన్న జింపింగ్ 40 మందితో ఉజ్బెక్ లో సమర్ఖండ్ ప్రాంతంలో ఎస్.ఈ.ఓ సమ్మిట్ లోనూ,థాయిలాండ్ సమావేశంలోనూ పాల్గొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపనీస్, జర్మనీ వాళ్ళ అందరితో కలిశాడు. కానీ చెక్ రిపబ్లిక్ ఇంకా ఫీజీ దేశాలు చైనా ని దిక్కరిస్తున్నాయి. అవి చైనా కన్నా తైవాన్ కు ఎక్కువ మద్దతునిస్తున్నాయి. చెక్ రిపబ్లిక్ ఇంకా ఫీజీ దేశాలు తాము చైనా దేశపు ఎక్స్టెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నాయి.
తాజాగా, గతంలో నాటోలో పనిచేసిన సైనిక అధికారి పీటర్ పావెల్ చెక్ రిపబ్లిక్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన తైవాన్ అధ్యక్షురాలికి ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. మీ స్వేచ్ఛకు ఇంకా ప్రజాస్వామ్యానికి అండగా ఉంటామని పీటర్ పావెల్ స్టేట్మెంట్ ఇచ్చేసరికి తమతో సంబంధాలు చెడగొట్టుకుంటున్నాడని చెక్ రిపబ్లిక్ పై సీరియస్ అయిపోతుంది చైనా.
మరొక పక్క ఫీజీ దేశంలో పదహారేళ్ల తర్వాత సెల్విని రెబూక నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కూడా చైనాకు దిమ్మతిరిగే షాక్ ని ఇచ్చింది. 2011లో అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పుడు చైనా వాళ్ళు ఫిజీలో పోలీసులుగా పనిచేయచ్చు, ఫిజీ వాళ్ళు చైనాలో పోలీసులుగా పనిచేయవచ్చు అని ఒక తీర్మానం చేసుకున్నారు. కానీ చైనా ఆ తీర్మానంలో తారతమ్యాలు చూపించింది. ఫైనల్ గా ఇప్పుడు ఫీజీ దేశంతో పాటు అన్ని దేశాలు చైనాను వ్యతిరేకిస్తున్నాయి.