ఇండియా ఆయుధ సంపద.. శత్రువుల్లో భయం పెంచిందా?

రిపబ్లిక్ డే నాడు భారతదేశం ఏఏ రంగంలో అభివృద్ధి చెందిందో.. పెరేడ్ గ్రౌండ్లో దాన్ని ఎగ్జిబిట్ చేస్తారు. ఈ సారి భారతదేశానికి సంబంధించిన కొత్త కొత్త ఆయుధాలను కూడా ఎగ్జిబిట్ చేశారు. గతంలో భారతదేశం కొత్త ఆయుధాలు కావాలంటే దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది, వేరే దేశాలపై ఆధారపడవలసి వచ్చేది. కానీ తాజాగా భారతదేశం తనకు కావాల్సిన ఆయుధాలను తానే తయారు చేసుకునే స్థాయికి అభివృద్ధి చెందింది. ఇంకా చెప్పాలంటే ఆయుధాలు అవసరమైన దేశాలకు అమ్ముతుంది కూడా. భారతదేశపు అమ్ముల పొదికే గర్వకారణమైన పినాక క్షిపణి గానీ, బ్రహ్మోస్ గాని, తేజస్ గాని, గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శితమైన తీరు అందర్నీ అబ్బురపరిచింది.

ఈ సంవత్సరం భారతదేశం తన 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. జాతీయ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పధ్ లో ఈ సంవత్సరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్వదేశీ పరికరాలతో  తయారుచేసిన స్వదేశీ ఆయుధాలను మాత్రమే ఎగ్జిబిట్ చేసారు.  ఈ విధంగా గణతంత్ర దినోత్సవంలో భారత్ స్వదేశీయంగా తయారు చేయబడిన ఆయుధాలు మాత్రమే ప్రదర్శించబడ్డ తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.  ఇందులో భారతదేశంలో తయారు చేయబడ్డ 185 mm ఫీల్డ్ గన్ తో  21 గన్ సెల్యూట్‌లతో  ఖచ్చితత్వం మరియు విశ్వసనీయత కలగలిసిన ఎంపీటీ అర్జున్, నాగ్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, ఆకాష్, ఎయిర్ డిఫెన్స్ మిస్సయిల్స్  సహా ఇతర క్షిపణులు భారత సైన్యంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థతో  సమకూరి ఉన్నాయి.

గతంలో ఎటువంటి నేషనల్ పెరేడ్ లో అయినా భారతదేశం బయట నుండి తీసుకువచ్చిన మిగ్గులను లేదా మిగిలిన ఆయుధాలను ప్రదర్శించేది. అలాగే ఇప్పుడు అయితే అలా చూపించాలంటే రాఫెల్ ను చూపించాలి. కానీ ఇప్పుడు భారతదేశంలో తన స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ పరికరాలతో తయారుచేసిన ఆయుధాలను, యుద్ధ వాహనాలను ప్రపంచం మొత్తానికి ప్రదర్శించి తాము కూడా ఆయుధాల తయారీలో ఎంతో ప్రగతిని సాధించామని ఘనంగా చాటి చెప్పింది  భారత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: