ఇండియాకు ఆ టెండర్ దక్కితే పెట్రోల్ చాలా చౌక?
ఈ అంశాలను గమనించిన అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఎక్కడ తక్కువకు వస్తే ఆ దేశాల్లో ఆయిల్ కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ విధమైన విదేశాంగ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే దేశాలు కూడా సరైన దారికి వచ్చాయి. ప్రపంచంలోనే మూడవ స్థానంలో చమురును ఉపయోగిస్తున్నటువంటి దేశానికి ఎక్కువ ధరకు అమ్మకుండా సరైన ధరకు ఇవ్వడానికి ఆయా చమురు ఉత్పత్తి దేశాలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఈ విధానాన్ని కూడా పాటిస్తూనే చమురు నిల్వలు ఉండే దేశాల్లో టెండర్లు వేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకొన్నారు.
ముఖ్యంగా రష్యాలో ని సైబీరియా ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం యూరప్ దేశాలు అమెరికా అక్కడ టెండర్లు వేయడానికి నిరాకరిస్తున్న సమయంలో భారత్ కి మంచి అవకాశం వచ్చింది. సైబీరియాలో ప్రాంతంలో కనక టెండర్ దక్కితే మరింత తక్కువ ధరకు భారత్ చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్ తో పాటు చైనా కూడా వీటిలో టెండర్ వేసేందుకు పోటీ పడుతుంది. మన దేశం కనుక అక్కడ ఆయిల్ నిక్షేపాలని వెలికి తీయడానికి అనుమతి గనక పొందితే చాలా తక్కువ ధరకే ఆయిల్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వం ఎంత మేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. తద్వారా దేశంలో తక్కువ ధరకే ఆయిల్ దొరికే అవకాశాలు ఉంటాయి.