విశాఖలో కేసీఆర్‌ సభ.. అసలు ప్లాన్ ఇదేనా?

గతంలో విశాఖ వచ్చి స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకుని వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు తిరిగి విశాఖపట్నం  రాబోతున్నారని తెలుస్తుంది. కానీ ఈసారి ఆయన వచ్చేది రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి అని తెలుస్తుంది. తన  భారతీయ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మార్చాలన్న ఉద్దేశంతో ఉన్న కెసిఆర్ ఇప్పుడు బిఆర్ఎస్ అధ్యక్షుడు హోదాలోనే విశాఖపట్నం రానున్నారు. అక్కడ త్వరలో భారీ సమావేశం జరగబోతుంది. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న తోట చంద్రశేఖర్ ది గుంటూరు. కృష్ణ, గుంటూరు ఇంకా ఉభయగోదావరి జిల్లాలు కాపు సామాజిక వర్గం బలంగా ఉండే ప్రాంతాలు. కెసిఆర్ వెలమ వర్గానికి సంబంధించిన వారు. అయితే ఈ నాలుగు జిల్లాల్లోనూ వాళ్ళకి బలం  ఉండదని విశాఖపట్నంలో పెట్టారా అంటే అది కూడా కారణం కాదని తెలుస్తుంది.

అసలు కారణం ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం ఇంకా విశాఖపట్నం, ఇలా ఈ ప్రాంతాలు వెలమలకు మంచి బలం ఉండే ప్రాంతాలు. ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి ఇంకా అయ్యన్నపాత్రుడు లాంటివారు వెలమ వర్గం లోని తెగలకు సంబంధించిన వారే. అక్కడ రాజకీయంగా సక్సెస్ సాధించిన వాళ్లు ఎక్కువగా వెలమ వర్గానికి చెందిన వారే అయి ఉంటారు. ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వెలమ వర్గం వారక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ  వారంతా కూడా  కెసిఆర్ ని తమ నాయకుడిగా భావిస్తూ ఉంటారు. వారు భారీ బహిరంగ సభ పెట్టడానికి కలిసి వస్తూ ఉండడం కూడా ఒక ఉద్దేశం. ఆర్థికంగా వారు అక్కడ భారీ బహిరంగ సభ జరగడంలో తోడ్పడతారు.

అదే కాకుండా అక్కడ రాజకీయ నాయకులను కూడా తమ వైపుగా తిప్పుకునే ఆలోచన అది. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ వారు  వెలమలకు మంచి సపోర్ట్. మరి కెసిఆర్ వైఎస్సార్సీపీకి సపోర్ట్ అన్న విషయం తెలిసిందే. కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా ఉన్న వెలమలు  బిఆర్ఎస్ ని ప్రోత్సహిస్తారా అనేది మాత్రం తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: