మోదీపై బీబీసీ విషం.. విచారణ జరుగుతుందా?

బ్రిటన్ లో బీబీసీ కి ఎదురులేదు. ఇండియాలో దూరదర్శన్ ఎలాగో బ్రిటన్ లో బీబీసీ అలాగే.. కానీ ఇది మన దేశ ప్రధాని మోడీ పై విషం చిమ్ముతూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తెల్లజాతీయుల అహంకారానికి నిదర్శనం బొరిస్ జాన్సన్. ఈయన అనుచరుడిని బీబీసీ లో ప్రధాన వ్యక్తిగా నియమించుకున్నారు. దీనికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. బీబీసీలో కొనసాగుతున్న ప్రతినిధిని అడ్డదారిలో తెచ్చుకుని నియమించుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రస్తుత బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ ఎవరైతే బీబీసీలో అక్రమంగా నియామకం కాబడ్డారో వారిపై విచారణ జరిపించాలని ఆదేశించారు.

బీబీసీ చీఫ్ గా నియమితులవడానికి గతంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న బొరిస్ జాన్సన్ కు ఆర్థికంగా సహాయం అందించారని దానికి అనుగుణంగానే బీబీసీ చీఫ్ గా అవకాశం ఇచ్చారని ప్రధాన ఆరోపణ. దీనిపై ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతుంది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. బొరిస్ జాన్సన్ కు ఆర్ఠిక పరంగా చాలా విషయాల్లో ప్రస్తుత బీబీసీ చీఫ్ పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడని అందుకే బొరిస్ జాన్సన్ బీబీసీ చీఫ్ గా  ఆ వ్యక్తి ని నియమించడానికి సహకరించాడని తెలుస్తోంది.

ఏది ఏమైనా దేశంలో అతిపెద్ద మీడియా సంస్థ, ప్రపంచంలో కూడా ఎక్కువగా వీక్షకులు ఉన్నటువంటి బీబీసీ కొంతమందికి అనుకూలంగా వార్తలు రాయడం, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా టెలికాస్ట్ చేయడం అనేది సబబు కాదు. దీనిపై ఆ దేశ ప్రభుత్వం చేపట్టినటువంటి విచారణలో ఎలాంటి నిజాలు నిగ్గు తేలుతాయో వేచి చూడాలి.

ప్రస్తుతం భారత్ లో కూడా బీబీసీ ఛానల్, ఆ వార్తలను చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఒక దేశ ప్రధానిపై వ్యతిరేకంగా వార్తలు రాసే సమయంలో అందులో ఎంత వరకు వాస్తవం ఉంది. ఏది సరైన సమాచారం, ఏది కాదు అనే విషయాన్ని లోతుగా పరిశీలించి నిజాలు తెలుసుకున్న తర్వాతనే వాటిని ప్రజల వద్దకు చేరవేయాలి. అప్పుడే సరైన సమాాచారం ప్రజలకు చేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BBC

సంబంధిత వార్తలు: