వార్నింగ్‌: ఈ వెంచర్లలో ప్లాట్లు అస్సలు కొనకండి!

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది. ఇదే సమయంలో అనేక రియల్ ఎస్టేట్‌ సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి. సరైన నిబంధనలు పాటించకుండా వెంచర్లు వేసి అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా కొనుగోలు దారులకు కొన్ని హెచ్చరికలు చేసింది. ఎంఎస్‌ స్క్వేర్‌ యార్డ్‌ ఫ్యాక్టరీ పేరున అభివృద్ధి చేసిన ప్రాజెక్టులో ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ స్పష్టం చేసింది.

ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌ల పేరుతో ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయ యూనిట్లు చేస్తున్నారని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా హెచ్చరించింది. "గోల్డెన్ పామ్స్ ఎన్‌క్లేవ్ "చేవెళ్లలో 12 ఎకరాల విస్తీర్ణం, "గ్రీన్ స్క్వేర్", కిస్తాపూర్‌లో 10.5 ఎకరాల విస్తీర్ణం, "ప్రైమ్ అవెన్యూ", రాకంచర్లలో 11.5 విస్తీర్ణం, "మెజెస్టిక్ విల్లాస్" ఎకరాలు, "స్టార్ కాలనీ" 3.5 ఎకరాల విస్తీర్ణంలో రాకంచర్లలో పెట్టుబడి పెట్టమని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా తెలిపింది. ఎకరాలల్లో పెట్టుబడి పెట్టండి, చదరపు గజాలలో ప్రయోజనం పొందండి అంటూ ఈ సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా తెలిపింది.

ఈ అయిదు ప్రాజెక్టులకు జిహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెరాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా స్పష్టం చేసింది. ఎటువంటి అనుమతులు లేని ప్రాజెక్టులు విక్రయాలు చేయడం రెరా చట్టం 2016లోని సెక్షన్ 3(1), 4(1)లను ఉల్లంఘించినట్లేనని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా తెలిపింది. రెరా చట్టం-2016 సెక్షన్ 3(1) ప్రకారం అనుమతులు లేకుండా "ప్రమోటర్ ఎవరూ ప్రకటనలుకాని, మార్కెటింగ్‌ కాని, బుక్‌ చేయడంకాని చేయకూడదని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా  వివరించింది.

తెలంగాణ RERA అథారిటీలో రిజిస్ట్రేషన్‌ అయ్యిన ప్రాజెక్ట్‌ల వివరాలు https://rerait.telangana.gov.in/SearchList/Search. ఈ లింక్‌లో ఉంటాయని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా వెల్లడించింది.  స్థిరాస్థి నియంత్రణ అథారటీలో...నమోదుకాని నమోదుకాని ప్రాజెక్ట్‌లలో యూనిట్లుల్లో కొనుగోలు చేయవద్దని స్థిరాస్థి నియంత్రణ అథారిటీ-రెరా హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: