కూల్చివేతల ఆర్కే.. నారా లోకేశ్‌ ఫైర్‌ ?

టీడీపీ నేత నారా లోకేశ్‌ మరోసారి మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే పై మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక అభివృద్ధిని మరచి ఎప్పుడూ ఇళ్లు కూల్చివేతపైనే శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టి సారిస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. తాడేపల్లి 16వ వార్డులో   నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రకాష్ నగర్ వద్ద టీడీపీ నేత నారా లోకేశ్‌ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కరోనాతో మృతి చెందిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీడీపీ నేత నారా లోకేశ్‌ పరామర్శించారు. అన్ని విధాల ఆదుకుంటామని టీడీపీ నేత నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు.  ప్రకాష్ నగర్ లో పలు సమస్యలను మహిళలు టీడీపీ నేత నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. కార్పొరేషన్ సిబ్బంది అర్థరాత్రుల్లో తాగునీరు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు టీడీపీ నేత నారా లోకేశ్‌తో చెప్పారు.

ప్రభుత్వం వేసిన పన్నుల భారం తో సామాన్యులు బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారని టీడీపీ నేత నారా లోకేశ్‌ చెప్పారు.  కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తుందని టీడీపీ నేత నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.  నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్, ఆర్టీసి ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్‌ చెప్పారు.

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని టీడీపీ నేత నారా లోకేశ్‌  హామీ ఇచ్చారు.  గెలిచిన వెంటనే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే తమకు హామీ ఇచ్చి మోసం చేసారని ప్రజలు టీడీపీ నేత నారా లోకేశ్‌ కు విన్నవించారు.  గెలిచిన ఏడాదిలోనే ఇళ్ళ పట్టాలు, త్రాగునీరు,  డ్రైనేజీ, రోడ్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని టీడీపీ నేత నారా లోకేశ్‌  తెలిపారు. చెత్త పన్ను పేరుతో ప్రజల్ని వేధించడం దుర్మార్గమని అది చెల్లించకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పడం దారుణంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్‌  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: