జగన్ సర్కారుపై ఆ కేంద్ర మంత్రి ఆగ్రహం.. దేనికి సంకేతం?

కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి ఇటీవల ఎక్కువగా ఏపీలోనే కనిపిస్తున్నారు. ఏపీలోని అనేక జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. కేంద్ర పథకాల అమలు తీరును ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వై.ఎస్.ఆర్.జిల్లాలో అమలు చేయడంలో కొన్నిశాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధానంగా వైద్యఆరోగ్యం, ఐసీడీఎస్ అధికారులు సరైన రికార్డులు పాటించడం లేదని... వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి ఆదేశించారు. జిల్లా అధికారులతో కడప కలెక్టరేట్ లో కేంద్రమంత్రి నిర్వహించిన సమావేశానికి బీజేపీఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఇతర శాఖల అధికారులు కూడా హాజరయ్యారు.

అధికారుల తీరుపై కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కువగా ఎస్సీఎస్టీ వర్గాల్లో బాల్య వివాహలు జరుగుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి అన్నారు. ఆకాంక్షిత జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలుసుకోవడానికి ఈ జిల్లాకు వచ్చానన్న మంత్రి... అన్నిటిపై సమీక్ష చేశానని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు 50 వేల ఇళ్లు మంజూరు చేస్తే... వాటిలో 6 వేల ఇళ్లు కూడా పూర్తి కాలేదని కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. టిడ్కో ఇళ్లు పూర్తయినా పేదలకు అందించకుండా జాప్యం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. వైద్యఆరోగ్యశాఖను సమీక్షిస్తున్న సమయంలో చాలావరకు ఎనీమియా కేసులు నమోదవుతున్నా... అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి అన్నారు. కేంద్ర పథకాలు ఏవిధంగా అమలవుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తానని కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: