ఢిల్లీ మద్యం కేసులో సంచలన విషయాలు..?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు ఈ కేసులో ఎవరి నివాసాల్లో సోదాలు జరుగుతాయో అన్న చర్చలు జరుగుతున్నాయి. అటు ఢిల్లీ, ఇటు తెలంగాణలోనూ ఈ కేసు సంచలనంగా మారింది. ఇలాంటి ఈ కేసు దర్యాప్తు సంస్థ ఈడి దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా వ్యక్తిగత సహాయకుడు దేవేంద్ర శర్మ నివాసం సహా... ఐదు ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరిపింది. ఈ వివరాలు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని ఈడి అధికారులు తెలిపారు. అయితే.. దేవేంద్ర శర్మను కేంద్ర కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లి... వాగ్మూలం నమోదు చేసినట్లు ఈడి వర్గాలు వెల్లడించాయి.

అయితే.. తన వ్యక్తిగత సహాయకుడు దేవేంద్ర శర్మను ఈడి కార్యాలయానికి తీసుకువెళ్లడంపై ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. గుజరాత్‌లో బిజెపికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే తమపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తోందని ఆరోపించారు. తన నివాసంతో పాటు.. తన గ్రామంలో కూడా సోదాలు చేసినా దర్యాప్తు సంస్థలకు ఏమీ దొరకలేదని, ఇప్పుడు తన పిఎ ఇంటిపై దాడి చేసినా... లభించిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో సీబీఐ అధికారులు మనీష్‌ సిసోదియా నివాసంలో సోదాలు చేపట్టారు. ఈడి, సిబిఐ కేసు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో రెండు దర్యాప్తు సంస్థలు పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లిని సిబిఐ, సమీర్‌ మహేంద్రుని ఈడి అరెస్టు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఎపి, పంజాబ్‌, హర్యానా, యూపి రాష్ట్రాల్లో పలు మార్లు సిబిఐ, ఈడిలు సోదాలు నిర్వహించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: