జయహో ఇండియా.. కామన్వెల్త్‌లో కుమ్మేశారు?

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 61 పతకాలతో కామన్వెల్త్ క్రీడల్లో 4వ స్థానానికి ఎగబాకి భళా భారత్ అనిపించారు. ఈ ఏడాది మన ఆటగాళ్లు మొత్తం 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించారు. అందులో భారత రెజ్లర్లు అందరికంటే ఎక్కువగా పతకాల పంట పండించారు. మొత్తంమీద 12 పతకాలతో భారత రెజ్లర్లు సత్తా చాటారు.

రెజ్లింగ్‍లో భారత్‍కు 5 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాలు దక్కాయి. ఇక ఆ తర్వాత వరుసలో భారత వెయిట్ లిఫ్టర్లు ఉన్నారు. వీరు మొత్తంగా 10 పతకాలు సాధించారు. వెయిట్‍లిఫ్టింగ్‍లో భారత్‍ ఖాతాలో 3 పసిడి, 3 రజతం, 4 కాంస్యాలు వచ్చాయి. అలాగే టేబుల్‍ టెన్నిస్‍లో భారత్‍కు 4 స్వర్ణాలతో పాటు మొత్తం 7 పతకాలు వచ్చాయి. టేబుల్‍ టెన్నిస్‍లో భారత్‍కు 4 పసిడి, ఒక రజతం, రెండు కాంస్యాలు దక్కాయి. బాక్సింగ్‍లో భారత్‍కు 3 పసిడితో పాటు మొత్తం 7 పతకాలు వచ్చాయి.

బాక్సింగ్ విషయానికి వస్తే.. భారత్‍ ఖాతాలో 3 స్వర్ణం, ఒక రజతం, 3 కాంస్యాలు దఖలు పడ్డాయి. బ్యాడ్మింటన్‍లో 3 స్వర్ణాలతో పాటు 6 పతకాలు సాధించారు. భారత షట్లర్ల ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు వచ్చి చేరాయి. ఇక అథ్లెటిక్స్  విభాగం నుంచి భారత్‍కు మొత్తం 8 పతకాలు లభించాయి. వీటిలో ఒక స్వర్ణంతో పాటు 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి.

లాన్‍బౌల్స్ క్రీడలో భారత్‍కు ఒక స్వర్ణం, ఒక రజతంతో పాటు 2 పతకాలు వచ్చాయి. పారా పవర్‍లిఫ్టింగ్‍లో భారత్‍ ఖాతాలో ఒక స్వర్ణ పతకం వచ్చింది. జూడోలో భారత్‍కు 2 రజతాలు, ఒక కాంస్యంతో పాటు మొత్తం 3 పతకాలు దక్కాయి. హాకీలో ఒక రజతం, ఒక కాంస్యం సహా భారత్‍కు మొత్తం 2 పతకాలు వచ్చాయి. ఈ ఏడాదే తొలిసారిగా ప్రవేశపెట్టిన క్రికెట్‍లో భారత మహిళలకు రజత పతకం దక్కింది. స్క్వాష్‍లో భారత్‍ ఖాతాలో రెండు కాంస్య పతకాలు దక్కాయి. మొత్తం మీద 61 పతకాలు సాధించిన ఇండియా కామన్వెల్త్ దేశాల్లో టాప్ ఫోర్‌ లో స్థానం సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: