చైనా కుట్రను ఆఖరి నిమిషంలో పసిగట్టిన అమెరికా?

చైనా.. ప్రపంచంలో అమెరికాతో ప్రస్తుతం పోటీ పడగల సత్తా ఉన్న దేశం.. పోటీ పడగల దేశమే కాదు.. పడుతున్న దేశం కూడా. అమెరికాకు దీటుగా అభివృద్ధి చెందుతున్న దేశం.. అలాంటి చైనా తానే నెంబర్ వన్ కావాలని ఎత్తులు వేస్తోంది. నంబర్ వన్ గా ఉన్న అమెరికాను దెబ్బ కొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

అలాంటి ఓ ప్రయత్నం చేస్తూ.. ఆఖరి నిమిషంలో అమెరికాకు దొరికిపోయింది. అదేంటంటే.. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో 2017లో ఓ అందమైన చైనీస్‌ గార్డెన్‌ నిర్మిస్తామని గతంలో చైనా అమెరికాకు ఆఫర్ ఇచ్చింది. ఈ పార్క్ నిర్మాణానికి 100 మిలియన్ డాలర్లు వెచ్చిస్తామని కూడా చెప్పంది. ఈ పార్క్‌లో అదిరిపోయే దేవాలయాలు, పెవిలియన్‌లతోపాటు.. 70 అడుగుల చైనీస్‌ పగోడా కడతామని చెప్పింది. తమ టూరిజనం డెవలప్ అవుతుందని అమెరికా కూడా ఓకే చెప్పింది.

అయితే.. ఆఖరి నిమిషంలో అసలు విషయాన్ని అమెరికా గూడచార సంస్థ పసిగట్టింది. అసలు విషయం ఏంటంటే.. చైనా  పగోడా రూపంలో అమెరికా సమాచారం చేరవేసే కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంది. వాషింగ్టన్‌ డీసీలో అమెరికా పాలనా భవనాలకు కేవలం రెండు మైళ్ల దూరంలోని ఈ పగోడాను నిర్మించాలని చైనా ప్లాన్ చేసింది. ఈ పగోడాను చాలా ఎత్తుగా నిర్మించాలని ప్లాన‌ చేశారు.

దీని ద్వారా  సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరించాలని చైనా ఆలోచన. అంతే కాదు..  ఈ పగోడా నిర్మాణానికి వాడతామని చెప్పిన మెటీరియల్‌ కూడా వివాదాస్పదంగా ఉంది.  ఈ మెటీరియల్‌ మొత్తం తనిఖీలకు ఆస్కారం లేని దౌత్య మార్గాల్లో రప్పించాలని చైనా ఆలోచించింది. అయితే.. అత్యంత సమర్థవంతమైన అమెరికా నిఘా వ్యవస్థ ఈ విషయాన్ని పసిగట్టింది. చైనా ప్లాన్ తెలుసుకుని అమెరికా అధికారులే అవాక్కయ్యారట. ఈ పార్క్ నిర్మాణానికి అనుమతి రద్దు చేశారట.  అదీ సంగతి. అలా చైనా కుట్రను అమెరికా అధికారులు చివరి నిమిషంలో ఆపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: