జగన్‌ అప్పుడు పులి.. ఇప్పుడు పిల్లి?

ప్రత్యేక హోదా మీద జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో పులిగా మాట్లాడారని..  ఇప్పుడు పిల్లి అయ్యారని.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం, ప్రత్యేక హోదా, రుణాల గురించి స్పష్టంగా చెప్పిందని.. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్ర అభివృద్ధి చెందతుంది, ఏపీ హైద్రారాబాద్ లాగా అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి అని జగన్ అన్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా పై జగన్ కి అప్పుడున్న ఆవేశం ఇప్పుడు ఏమైందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

మనసులో భయం ఉన్నా.... కనీసం చేతుల కట్టుకొని ప్రత్యేక హోదా అడగొచ్చు కదా అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. మాట వరుసకు కూడా ప్రత్యేక హోదా అడగరే.. అంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. జగన్మోహన్ రెడ్డి బటన్ మోహన్ రెడ్డి అయ్యారని విమర్శించారు. పోలవరం పై గత ఇరిగేషన్ మంత్రి 2021 డిసెంబర్ కి పూర్తి చేస్తామన్నారని.. పోలవరంలో కాంట్రాక్టర్ తో రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేదని అన్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు.

పోలవరం ఈ ప్రభుత్వం హయాంలో పూర్తి కాదంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చూడాలన్నారు. ప్రసుత్త నీటిపారుదల శాఖ మంత్రి అంబటి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేము అని అంటున్నారని.. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2800 కోట్లు ఇవ్వాలని అడిగారు... మరో 6 వేల కోట్లు అడ్వాన్స్ ఇవ్వాలని అడిగారు... ఎలా ఇస్తారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్ట్ లో టీడీపి దోచేస్తుంది అని.... నిధులు అవసరం లేదని ప్రతిపక్షనేత హోదాలో జగన్ లేఖ రాశారని గుర్తు చేసిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఇప్పుడు అదే మాకు ఇబ్బందిగా మారిందని అందరూ అనుకుంటున్నారంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణం చేస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం, సిపీఎస్ రద్దు చేస్తామని అని చెప్పామని.. కానీ.. జగన్ సర్కార్ లో స్కూల్స్ మాయం... టీచర్లు మాయం అయ్యాయని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్‌ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: