హైకోర్టులో మళ్లీ జగన్‌కు మొట్టికాయలు తప్పవా?

ఏపీ హైకోర్టులో మరోసారి జగన్‌కు మొట్టికాయలు తప్పేలా లేవు.. ఎందుకంటే.. ఏపీలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి, న్యాయవాది అయిన జీవీ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆయన అంటే జీవీ రెడ్డి పిటిషనర్ తరఫున ఆయన న్యాయవాది పీజీవీ ఉమేశ్‌ చంద్ర పిల్ వేశారు. ఎందుకంటే.. నాలుగవ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పదవీకాలం 2020 లోనే ముగిసింది. కానీ.. ఇప్పటి వరకు కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. ఇలా రాజ్యాంగ బద్ద సంస్థకు  కమిషన్‌ను నియమించకపోవడం రాజ్యాంగ విరుద్ధం.

రాష్ట్ర ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేయకపోవడం వల్ల .. స్థానిక సంస్థల నిధులను శాస్త్రీయ కోణంలో పంపిణీ చేయడం లేదు. స్థానిక సంస్థలపై దీనివల్ల ప్రతికూల ప్రభావం పడుతోంది. చట్ట నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఆర్థిక స్థితి మెరుగుపరచడం, పన్నులు తదితర వ్యవహారాలను ఆర్థిక సంఘం పర్యవేక్షిస్తుంది. పంచాయతీలు, స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి నిధుల కేటాయింపు గురించి గవర్నరుకు సిఫారసు చేస్తుంది.

లెక్క ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికన గవర్నర్ .. శాసనసభ ముందు ఉంచాలి. కానీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రక్రియసైతం నిలిచిపోయింది. భారత రాజ్యాంగంలోని అధికరణ 243(ఐ) ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఆర్థిక సంఘం ఉండాల్సిన అవసరం ఉంది. నాలుగో ఫైనాన్స్ కమిషన్ కాల పరిమితి 2020 తో ముగిసినా.. ఇప్పటి వరకు ఐదో ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయలేదని న్యాయవాది వాదించారు. ఇలాంటి వ్యవహార శైలి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కోర్టుకు తెలిపారు.

ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్ర కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి స్థా నిక సంస్థలకు రావాల్సిన నిధులు అందడం లేదని వాదించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తక్షణం ఐదో  రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జీవీరెడ్డి లాయర్ కోరారు. ఈ కేసులో వాదనలు బలంగానే ఉన్నందువల్ల జగన్‌కు మరోసారి హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పకపోవచ్చేమో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: