సోము వీర్రాజన్నా.. మరీ ఇంత ఓవరెందుకన్నా?

సోము వీర్రాజు.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. నిన్న పోలీసులపై హల్ చల్ చేశారు. అమలాపురంలో కొన్నిరోజుల క్రితం జరిగిన అల్లర్ల కారణంగా ఇంకా 144 సెక్షన్‌ అమలులో ఉంది. రాజకీయ పర్యటనలు, ప్రసంగాలు, యాత్రలు నిషిద్ధం. అయితే సోము వీర్రాజు మాత్రం 144 సెక్షన్ ఉన్నా అమలాపురంలో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. ఆయన వెళ్తే మళ్లీ వాతావరణం తేడా వస్తుందని పోలీసులు ఆయన్ను దారిలోనే అడ్డుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన పోలీసులపై వీరంగం వేశారు.

ఏకంగా పోలీసులను నెట్టేస్తూ రచ్చరచ్చ చేశారు. బీపీ పెంచేసుకుని నడిరోడ్డుపై వీరంగం వేశారు. ఇదంతా వీడియో తీసిన పోలీసులు ఆ తర్వాత దాన్ని మీడియాకు విడుదల చేశారు. అంతే కాదు.. సాయంత్రానికి ఆయన తీరును పరిశీలించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో కేసు నమోదు చేశారు. అయితే.. సోము వీర్రాజు మాత్రం ఇంకా పోలీసుల తీరునే తప్పుబడుతున్నారు.  పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలా మారారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోనే అత్యున్నత  ఉద్యోగాలైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయి వారంతా కొంతమంది వ్యక్తుల రాజకీయ ప్రయోజనాల కోసం కొమ్ముకాస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉద్యోగాలు చేయవలసి వస్తోందని సోము వీర్రాజు అంటున్నారు  ప్రకృతి శోభతో ప్రశాంతమైన  వాతావరణానికి చిరునామా లాంటి కోనసీమలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఊపిరి తీసుకోవడం కూడా కష్టతరంగా మారిందని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమ అల్లర్లకు ఆజ్యం పోసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే అమాయకులు కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతున్నారని సోము వీర్రాజు అంటున్నారు. ప్రజల చ్ఛాయుత జీవనానికి పాటు పడాల్సిన పోలీసు శాఖ రాజకీయ స్వార్థం కారణంగా ప్రజల స్వేచ్ఛను హరిస్తు, రోడ్లకు అడ్డంగా కంచెలు వేసి కాపలాకాయాల్సిన దుస్థితికి రాష్ట్రం దిగజారిందని సోము వీర్రాజు అంటున్నారు. ఆ సంగతి ఏమో కానీ సోము వీర్రాజు నడిరోడ్డుపై చేసిన వీరంగం మాత్రం తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: