అచ్చెన్నా.. మరీ అడ్డంగా మాట్లాడితే ఎట్టా?

వైసీపీ మంత్రులు సామాజిక న్యాయ భేరి పేరుతో యాత్ర చేసిన సంగతి తెలిసిందే. జగన్ తన హయాంలో ఎక్కువ పదవులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వాస్తవం కూడా అదే.. ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ,ఎస్టీలకు గతంలో పదవులు వచ్చిన దాఖలాలు లేవు. అంతే కాదు.. జగన్ ఇతర కార్పొరేషన్లు, స్థానిక సంస్థల పదవుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై విమర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఓ వితండ వాదం చేశారు.

వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో కేవలం 10 మంది బీసీలకే మంత్రి పదవులు ఇచ్చారని అచ్చెన్న అంటున్నారు. అదే టీడీపీ మాత్రం 103 సీట్లే  గెలిచినా 9 మందికి మంత్రి పదవులు ఇచ్చిందంటున్నారు. వైసీపీ, టీడీపీలో ఎవరిది సామాజిక న్యాయమో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అయితే.. అచ్చెన్న చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఎన్ని సీట్లు గెలిచినా.. అధికారం అంటూ వస్తే ఇచ్చే మంత్రి పదవుల సంఖ్య ఒకటే ఉంటుంది. మరి జగన్ పది మంది బీసీలకు అవకాశం ఇస్తే.. గతంలో 9 మంది బీసీలకే అవకాశమిచ్చిన టీడీపీ మేమే గొప్ప అని చెప్పడం ఏం లాజిక్కో అచ్చెన్నాయుడికే తెలియాలేమో.

రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సీట్లును బట్టి ఆ రాష్ట్ర కేబినెట్‌లో ఉండాల్సిన మంత్రి పదవుల లెక్క తేలుతుంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా.. ఎన్ని సీట్లతో గెలిచినా అదేమీ మారదు.. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 88 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం.. ఆ తర్వాత ఎన్ని సీట్లు వచ్చినా.. అదనపు మంత్రి పదవులు ఉండవు.. జగన్‌కు 151 సీట్లు వచ్చాయి కదా అని 70 మంది మంత్రులను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండదు.

అలాంటప్పుడు.. గెలిచిన సీట్లకూ ఇచ్చిన మంత్రి పదవులకూ ఏంటి సంబంధం.. విమర్శలు చేసే ముందు ఇలాంటి చిన్న లాజిక్‌లను మర్చిపోతే ఎలా అంటూ అచ్చెన్నపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: