ఇవాళ, రేపు మహానాడు.. టీడీపీ ఫ్యాన్స్‌కు పండుగే!

ఇవాళ, రేపు టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఒంగోలు తొలిసారి జరుగుతున్న ఈ మహానాడు  ఉదయం 8.30 గంట లకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం అవుతుంది. ఉదయం 10 గంటలకు ఫొటో ప్రదర్శన ఉంటుంది. అప్పుడే రక్తదాన శిబిరాల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభిస్తారు. ఉదయం 10.15 నుంచి వేదికపై కార్యక్రమాలు మొదలవుతాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి జెండాను ఆవిష్కరిస్తారు.

మొదట ఇటీవల మరణిం చిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. ఉదయం 11.45 కి చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత తర్వాత తీర్మానాలపై చర్చ ప్రారంభం అవుతుంది. ఇక ఈ రాత్రి 8 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ఇవాళ్టి కార్యక్రమం చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో ముగుస్తుంది. రేపు ఎన్టీ ఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం నేతలు  ఘనంగా నివాళులర్పిస్తారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. రేపు మధ్యాహ్నం మండువారిపాలెంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభతో మహానాడు ముగుస్తుంది.

ఈ మహనాడులో చర్చించే అంశాలపై నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించుకుంది. ఇవాళ మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాలపై టీడీపీ చర్చించింది. మహానాడు తీర్మానాలకు తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఈ మీటింగ్‌లో మహానాడు ప్రతినిధుల సభలో 17 తీర్మానాలు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ మొత్తం 17 తీర్మానాల్లో  ఏపీకి 12 తీర్మానాలు, తెలంగాణకు 3 తీర్మానాలు, అండమాన్ కు ఒక తీర్మానం ఉంటాయి.

ఈ  మహానాడులో ప్రవేశ పెట్టే రాజకీయ తీర్మానాలపై నిన్ననే పొలిట్ బ్యూరోలో కూలంకషంగా  చర్చించారు. ఈ తీర్మానాల్లో ఏపీకి ప్రాధాన్యత దక్కింది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా నిరాశజనకంగా ఉంది. అందుకే ఏదో నామ్‌ కే వాస్తేగా మూడు తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: