టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన అధికారంలో లేరు. పైగా గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ.. ప్రజలు ఎందుకు ఆయనకు జేజేలు పలుకుతున్నారు ? అంటే.. స్థానికుల మనోభావాలను ఆయన పసిగట్టారు. వారికి అండగా నిలబడ్డారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్న విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనుకున్నది సాధించారు. దీంతో ఇక్కడి రైతులు.. ప్రజలు.. ఇప్పుడు కొమ్మాలపాటి కృషిని అభినందిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆయన వెంటే ఉంటామంటూ ప్రకటిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొమ్మాలపాటి ప్రాతినిధ్యం వహించిన పెదకూరపాడు నియోజకవర్గాన్ని నరసారావుపేట కేంద్రంగా ఏర్పడ్డ పల్నాడు జిల్లాలో కలిపింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన.. ముసాయిదా ప్రకటనలో గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. అయితే.. దీనివల్ల తమకు ఇబ్బందులు వస్తాయని.. గుంటూరుకు దూరమై పోతామని.. కాబట్టి.. దీనిని గురజాల రెవెన్యూ డివిజన్ నుంచి తప్పించాలని ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్రస్థాయిలో ఆంందోళనలు నిర్వహించారు. అయితే.. స్థానికంగా ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని లైట్ తీసుకున్నారు.
తాను ప్రజల తరఫున మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న భయంతో అసలు ఈ విషయాన్ని ఆయన పట్టించుకోలేదన్న ప్రచారమూ ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆయన వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. దీంతో రంగంలోకిది గిన కొమ్మాలపాటి శ్రీధర్.. రైతులు.. స్థానికుల పక్షాన బలమైన గళం వినిపించారు. ఆయన ముందు నుంచి సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలను కలుపుతూ సత్తెనపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నినాదం అందుకున్నారు. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలను కలిపి సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలతో కలిసి ఆయన ఉద్యమాలు నిర్వహించారు. కలెక్టర్‌కు వినతి పత్రాలు కూడా సమర్పించారు. ప్రజలు చేసిన ప్రతి నిరసనకు అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన పోరాటం ఫలించింది. ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ క్రమంలోనే సత్తెనపల్లి-పెదకూరపాడుల
ను కలుపుతూ.. సత్తెనపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ శ్రీధర్‌కు మంచి ప్లస్ అయింది. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు మైనస్ అయింది.