చంద్రబాబు: ఇంత సీరియస్‌ ఇష్యూలో.. అంత కామెడీ ఏంటి?

ఏపీలో ఇప్పుడు రాజకీయం క్రమంగా రంజుగా మారుతోంది. ఓవైపు రాజధాని అంశం సీఎం జగన్‌కు షాకింగ్‌ గా మారింది. మరోవైపు వివేకానంద హత్య కేసు కూడా జగన్ టీమ్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీది చాలా కీలకమైన పాత్ర.. అసలు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే.. కానీ.. ఇప్పుడు క్రమంగా ఆ పార్టీకి అవకాశాలు వస్తున్నాయి. వాటిని ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారనేది చూడాలి.


అలాంటి అంశాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటి.. ఈ కేసు విచారణలో సీబీఐ చార్జ్ షీట్‌ కూడా దాఖలు చేసింది. అందులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డే వైఎస్ వివేకాను చంపించాడని భావిస్తున్నామని సీబీఐ అభిప్రాయపడింది. అయితే.. ఈ కేసులో విచారణ ఇంకా పూర్తి కాలేదు. కానీ.. ఈ చార్జ్ షీట్ బయటకు రావడం కలకలం సృష్టించింది. ఈ అంశంపై ఇటీవల చంద్రబాబు తరచూ మాట్లాడుతున్నారు. తాజాగా సర్పంచ్‌ల సదస్సులో చంద్రబాబు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు.


అయితే.. ఇంతటి సీరియస్ ఇష్యూను అడ్రస్ చేసేటప్పుడు చంద్రబాబు చాలా లైటర్ వేన్‌లో కామెడీగా ఈ విషయాన్ని చెప్పడం చూస్తే  ఆశ్చర్యం కలగకమానదు. ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టే ఇంతటి కీలకమైన అంశంపై మాట్లాడేటప్పడు అంతే సీరియస్ నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని కామెడీగా చెప్పడంతో ఇష్యూ కాస్తా డైల్యూట్ అవుతోంది.


సర్పంచ్‌ల సదస్సులో ఇలా చంద్రబాబు ప్రసంగించారు.. ఇదే అంశంపై నాలుగైదు రోజుల క్రితం కూడా చంద్రబాబు ఇలా కామెడీగానే స్పందించారు. వాస్తవానికి ఇవన్నీ క్లోజ్‌డ్‌ సర్క్యూట్‌లో జరిగే సమావేశాలే.. కానీ.. వీటిని టీవీలు, యూట్యూబ్‌ ఛానళ్లు లైవ్ ప్రసారాలు ఇస్తుంటారు. వీటి వల్ల అవి జనంలోకి వెళ్లిపోతుంటాయి. ఓ సీరియస్ అంశాన్ని బాధితులే కామెడీగా చెప్పేస్తే.. ఇక ఆ విషయంలో సీరియస్ నెస్ ఏముంటుంది.. ఈ విషయంపై చంద్రబాబు మరోసారి ఆలోచించుకుంటే బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: