పుతిన్ ఆ పని చేస్తే.. ప్రపంచానికే పెను ముప్పు..?

రష్యా అధినేత పుతిన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికే పెను ముప్పుగా మారనున్నాయి. ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవాలని తపించిపోతున్న పుతిన్‌.. ఇప్పుడు ఆ కోపంతో ప్రపంచాన్నే పెను ముప్పులో పడేస్తున్నారా.. ఉక్రెయిన్‌ వివాదం చినికి చినికి గాలి వానగా మారి ప్రపంచం భద్రతకు ముప్పుగా మారబోతోందా.. అంటే .. అవుననే సమాధానం వస్తోంది. ఉక్రెయిన్‌ తో యుద్ధం నేపథ్యంలో రష్యా అణ్వాయుధాలను కూడా సిద్ధం చేసుకోవడం చూస్తే.. ఏదైనా జరగరానిది జరగబోతోందా అన్న ఆందోళన ప్రపంచ దేశాలను పీడిస్తోంది.


ఉక్రెయిన్‌ తో ఘర్షణ నేపథ్యంలో అణ్వాయుధ వ్యవస్థలను అప్రమత్తం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించడం కలకలం రేపుతోంది. పుతిన్ ఆదేశాల కు అనుగుణంగా రష్యా సైన్యం ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. ఏ క్షణంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతం పైన అయినా అణు దాడికి చేసేందుకు రష్యా సిద్ధం అవుతోంది. ఇందుకు అనుగుణంగా కొన్నివిన్యాసాలు చేస్తోంది. వీటి  కోసం అణు జలాంతర్గాములను బేరెంట్స్‌ సముద్ర జలాల్లోకి రష్యా తరలించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.


రష్యా.. తన సైబీరియా మంచు అడవుల్లో సంచార క్షిపణి ప్రయోగ వ్యవస్థలను సిద్ధం చేసుకుంటోంది. అణు దాడికి అవసరమైన విన్యాసాలు చేపడుతోంది. సైబీరియా సముద్ర జలాల్లో నిర్వహించబోయే విన్యాసాల్లో అనేక అణు జలాంతర్గాములు పాల్గొంటాయని తెలుస్తోంది. ఈ మేరకు  రష్యా కు చెందిన నార్తర్న్‌ ఫ్లీట్‌ ఇప్పటికే ప్రకటించింది కూడా. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇవి పనిచేసేలా సిద్ధంగా ఉంచుతున్నారు.


రష్యాలో పలు నౌకా స్థావరాలు ఉన్న కోలా దీవి సమీపంలో తన యుద్ధ నౌకలను ఆదేశం రంగంలోకి దించింది. యుద్ధ నౌకలు విన్యాసాలు కూడా నిర్వహించబోతున్నాయని తెలుస్తోంది. సైబీరియా అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను ప్రయోగించబోతున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపింది. ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాల్లో చాలా వరకూ అమెరికా, రష్యాల వద్దే ఉన్నాయి. ఇప్పుడు రష్యా అణ్వాయుధాలను సిద్దం చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: