వైసీపీలో ఆ ఇద్దరు రెడ్లలో జగన్ టెన్షన్ స్టార్ట్...!
ఈ క్రమంలోనే గత 2019 తర్వాత ఆయన మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నించారు. కానీ, జగన్ అవ కాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో పిన్నెల్లిని సంతృప్తి పరిచేందుకు.. ఆయనకు విప్‌గా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ.. పార్టీ కోసం ఎంతో చేశాను.. ఇప్పటికీ.. ఎంతో కష్టపడుతున్నాను. అయినా.. గుర్తింపు లేదు.. అని పిన్నెల్లి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రి వర్గ విస్తరణలో ఖచ్చితంగా పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఇక, మరోవైపు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు గతంలో జగన్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని.. ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.
వాస్తవానికి గతంలోనే ఈ హామీ నెరవేర్చాల్సి ఉన్నా.. ఆళ్లకు కూడా జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో కొన్నాళ్లు ఆళ్ల అలిగారనే వార్తలు వచ్చాయి. దీంతో జగన్ ఆయనకు ఏపీసీఆర్‌డీఏ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఎందుకో ఆళ్ల ఆ బాధ్యతలు తీసుకోలేదు. ఇక, ఆ తర్వాత కొంత కాలం యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. తర్వాత.. మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. ఇదంతా కూడా మంత్రి మండలిలో చోటు కోసమేనని తెలుస్తోంది.
మరి జగన్ ఆలోచన మేరకు ఒక జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇస్తారా? అనేది సందేహం. మరోవైపు.. ఇప్పటి వరకు ఈ జిల్లా నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈమెను తప్పించినా.. ఆ వర్గానికే ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. కాబట్టి.. ఈ ఇద్దరు రెడ్డి నేతల ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలని అంటున్నారు పరిశీలకులు.