జగనన్న: వాత పెట్టి వెన్నపూయడం అంటే ఇదే కదా..?

మన దగ్గర పని చేసేవాళ్లపై కోపం వస్తే ఏం చేస్తాం.. అవకాశం ఉంటే దండిస్తాం.. లేదంటే చీవాట్లు పెట్టి వదిలేస్తాం.. మరి ఏపీ సీఎం జగన్ రూటే చాలా సెపరేటు.. ఆయనకు కోపం వస్తే శిక్ష వెంటనే అమలైపోతుంది. పర్యవసానాలు, గుంజాటలు అసలు ఉండనే ఉండవు.. ఆయనదంతా మొహమాటం లేని స్టయిల్.. డీజీపీ గౌతం సవాంగ్ విషయంలో అంతే జరిగింది.. చలో విజయవాడ వంటి కార్యక్రమాన్ని హ్యాండిల్ చేయడంలో గౌతం సవాంగ్ అట్టర్ ఫ్లాప్ అయ్యారని సీఎం జగన్ భావించనట్టున్నారు.


అంతే.. వెంటనే ఆ విషయంపై సమీక్ష నిర్వహించారు. గౌతం సవాంగ్ వివరణ తీసుకున్నారు.. కానీ.. అబ్బే.. దాంతో సీఎం జగన్ సంతృప్తి చెందనే లేదు. అంతే.. ఇంకేముంది.. పనిష్మెంట్ ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు.. అయ్యో.. సవాంగన్నకు ఇంకా ఏడాదిపైనే సర్వీసు ఉంది.. ఇప్పటికే ఆయన పోలీస్ శాఖలో టాప్ పొజిషన్‌లో ఉన్నారు.. ఇప్పుడు తప్పించాలంటే.. వేరే పోస్టు ఏదీ ఇవ్వలేం.. ఇచ్చినా బావుండదు.. పోలీస్ బాసుగా పని చేసే చిన్న పోస్టులోకి ఎలా పంపిస్తాం.. ఇలా.. ఇన్ని రకాలుగా సీఎం జగన్ ఆలోచించనే లేదు. అవన్నీ తర్వాత ముందైతే ఆ పోస్టు నుంచి పీకేసెయ్యాలి.. అంతే.. మరి రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా..?


అయితే.. సీఎం జగన్‌కు వాత పెట్టడమే కాదు.. దానిపైన వెన్నరాయడం కూడా తెలుసని గౌతం సవాంగ్ ఇష్యూ మరోసారి రుజువు చేసింది. డీజీపీ పోస్టు నుంచి పీకేసి తన ఆగ్రహం చూపించినా.. ఆ తర్వాత పాపం.. జగనన్న కాస్త ఆలోచించే ఉంటాడు.. మన సవాంగన్న ఇంకా పోలీస్ శాఖలో వేరే పోస్టులో ఎలా పని చేస్తాడు.. పాత సీఎస్‌ లాగా మరీ బాపట్ల వంటి బదిలీ చేస్తే ఎలా.. అనుకున్నారో ఏమో.. అందుకే ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టుతో వెన్నపూసేశారు.


గౌతం సవాంగ్‌కు ఇంకా ఏడాదిపైగా పదవీకాలం ఉంది.. కానీ.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టులో జాయిన్ కావాలంటే ఐపీఎస్‌ కు రాజీనామా చేయాలి.. అయినా సరే.. ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఇంకా మూడేళ్ల వరకూ పని చేసే అవకాశం ఉంది. అందుకే.. ఆయన కూడా జగనన్న వెన్నపూతకు సరే అనేశారు. సో.. మొత్తానికి జగన్‌కు వాత పెట్టడమే కాదు.. వెన్నపూయడమూ తెలుసన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: