దురంధర్ 2: కలెక్షన్స్ లో సంచలనం.. ఏకంగా అన్ని కోట్లా..?

Divya
బాలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం దురధర్ 2. ఈ సినిమా మార్చి 19న ఉగాది కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మొదట అన్ని భాషలలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కేవలం హిందీలోనే అన్ని ప్రాంతాలలో విడుదల చేశారు. దీంతో భాషతో సంబంధం లేకుండా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టినట్లు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో షేర్ చేస్తోంది దురంధర్ 2.


విడుదలైన రెండు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 331 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించినట్లు వినిపిస్తున్నాయి. ఇండియాలో రూ. 267 కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో రూ .64 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ బుక్ చేసేసరికి కనీసం రూ 500 కోట్లు క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఈరోజు నుంచి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వంటి భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా భాషలో అందుబాటులో లేకపోవడం వల్ల కొంతమేరకు కలెక్షన్స్ పై ప్రభావం పడినట్లుగా కనిపిస్తోంది. మరి ఈరోజు నుంచి సొంత భాషలలో సినిమా చూసే అవకాశం ఉండడంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.


మొత్తానికి దురంధర్ 2 లో రణబీర్ సింగ్ యాక్టింగ్ కి సైతం అభిమానులు ఇలా అయ్యారు. ఒక రా ఏజెంట్ చూపించిన తీరు డైరెక్టర్ ఆదిత్య ధర్ ను చాలా మంది ప్రశంశాల కురిపిస్తున్నారు. దురంధర్ 3 కూడా భారీ అంచనాలతో  ఈ ఏడాది జులై నెలలో విడుదల చేయబోతున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే చివరి పార్ట్ అన్నట్లుగా సమాచారం. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.1300 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన దురంధర్ సినిమా దురంధర్2 ఎంతటి కలెక్షన్ రాపడుతుందో ఫైనల్ గా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: