టీడీపీలో రెడ్ల‌కు మంచి రోజులొస్తున్నాయ్‌..!

VUYYURU SUBHASH
ఎన్నో ఏళ్ల నుంచి రెడ్డి సామాజికవర్గం గతంలో కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైసీపీకి మద్ధతుగా నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మెజారిటీ రెడ్డి వర్గం వైసీపీ వైపే ఉంది..అలాగే ఆ పార్టీలో రెడ్డి వర్గం నేతలదే హవా ఉంది. అయితే టీడీపీలో రెడ్డి వర్గం అంత ఎక్కువగా ఉండదు..ఏదో కొంతవరకే రెడ్డి వర్గం సపోర్ట్ టీడీపీకి ఉంది. కాకపోతే టీడీపీలో రెడ్డి వర్గం నేతలు బాగానే ఉన్నారు. రాయలసీమ జిల్లాల్లో టీడీపీలో రెడ్డి నేతలు ఉన్నారు.

కాకపోతే గత ఎన్నికల్లో టీడీపీ రెడ్డి నేతలు టోటల్‌గా ఫెయిల్ అయ్యారు. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో రెడ్డి నేతలు గెలిచారు గాని...టీడీపీ నుంచి ఒక్క రెడ్డి నేత కూడా గెలవలేదు...అందుకే సీమ, నెల్లూరు లాంటి జిల్లాల్లో టీడీపీ సత్తా చాటలేకపోయింది. అయితే ఈ సారి పరిస్తితి మారేలా ఉంది..టీడీపీలో రెడ్డి నేతలు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు..ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో టీడీపీ రెడ్డి నేతలు ముందుకెళుతున్నారు.

ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులని చూస్తే టీడీపీలో చాలామంది రెడ్డి నేతలు సత్తా చాటేలా ఉన్నారు...వచ్చే ఎన్నికల్లో కొందరు రెడ్డి తమ్ముళ్ళు ఖచ్చితంగా గెలిచేలా ఉన్నారు. అలా గెలిచే అవకాశాలు ఉన్న రెడ్డి నేతలు వచ్చి...పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమనేరులో అమరనాథ్ రెడ్డి, శ్రీకాళహస్తిలో gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి, పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, మంత్రాలయంలో తిక్కారెడ్డి, ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి లాంటి వారికి గెలవడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, పాణ్యంలో గౌరు చరితా రెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి లాంటి వారు ఇంకా పికప్ అవ్వాలసిన అవసరం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: