ఏపీ వైసీపీలో ఇదేం రాజకీయం.. ప్రజలకు దూరంగా ఎమ్మెల్యేలు...!
నిజానికి ఇప్పుడు రెండున్నరేళ్లపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వ పనితీరును వివరించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల నాటికి .. పార్టీని సమాయత్తం చేయాలి. కానీ, నేతలు మాత్రం మరోసారి జగన్‌పైనే ఆధారపడు తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేమంటే.. వలంటీర్లే అన్నీ చేస్తున్నారు కనుక.. తాము కొత్తగా చేసేది ఏముంటుందని .. వారు చెబుతున్నారు. వలంటీర్లు.. ప్రభుత్వ పథకాలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు తప్ప.. ప్రభుత్వ లేదా.. ప్రజా ప్రతినిధులుగా వారు లేరు. సో.. ఇక్కడ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది. అయితే.. ఆదిశగా నాయకులు ప్రయత్నించడం లేదు.
పైగా.. వలంటీర్లపై నెపం నెట్టేస్తున్నారు. మరోవైపు.. కొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నా రు. దీంతో వ్యాపారాలు.. వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. ఇది కూడా ప్రజలకు నేతలకు మధ్య బాగా గ్యాప్ పెంచుతోంది. కనీసం.. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు అంశంపై కొన్ని చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పైగా.. జిల్లాల ఏర్పాటు అనేది అత్యంత సంచలన విషయం. సో.. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా.. పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఇదే టీడీపీ అయి ఉంటే.,. ఇప్పటికి ఊరూ వాడా.. పాజిటివ్ ప్రచారంతోభారీ ఎత్తున నాయకులు ప్రజల మధ్య ఉండేవారు.
కానీ, వైసీపీలో మాత్రం ఈ తరహా పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నాయకులు అసలు ఏం చేస్తున్నారు? అనే విషయంపై తాడేపల్లి నుంచి విచారణ మొదలైంది. కొందరు నాయకులు జిల్లా కేంద్రాల్లోనే ఉంటున్నారని.. మరికొందరు హైదరాబాద్‌లో ఉంటున్నారని.. సీఎం కు సమాచారం చేరింది. దీంతో మరోసారి ఆయన నాయకులకు క్లాస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా.. నియోజకవర్గాలకు వెళ్లాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా.. నాయకులు ముందుకు కదులుతారా? లేక ఇంతేనా? అనేది ఆసక్తిగా మారింది.