జ‌గ‌న్ ఫిక్స్‌: చీరాలకు ఆమంచి... అద్దంకికి వెంక‌టేష్‌.. !

VUYYURU SUBHASH
వైసీపీ అధికారంలో ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు 151 సీట్లు వ‌చ్చాయి. ఈ సారి ప్ర‌భుత్వ వ్యతిరేక‌త‌ను ఈదుకుని అధికారం నిల‌బెట్టుకోవ‌డం జ‌గ‌న్ ముందున్న పెద్ద స‌వాల్‌. అందుకే ప్ర‌తి నియోజ‌క‌వర్గంలో గెల‌వ‌డం జ‌గ‌న్ ముందున్న పెద్ద టార్గెట్‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు త‌మ పార్టీకి ఉన్న సిట్టింగ్ సీట్ల‌లో చాలా వ‌ర‌కు పోతాయ్‌. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిన సీట్ల‌ను నిల‌బెట్టుకోవాల్సి ఉంది. ప్ర‌కాశం జిల్లా రూపు రేఖాలు ఇప్పుడు మారిపోయాయి. ఒంగోలు, బాప‌ట్ల జిల్లాల్లో ఈ జిల్లా విలీనం అయ్యింది. కొత్త‌గా ఏర్ప‌డిన బాప‌ట్ల జిల్లాలో ఇప్పుడు టీడీపీ ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ జిల్లాలో వేమూరు, బాప‌ట్ల మిన‌హా అన్ని చోట్లా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది.

చీరాల‌లో టీడీపీ నుంచి గెలిచిన సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం ఆ త‌ర్వాత వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న్ చాలా ప్లాన్లు వేస్తున్నాడు. మొత్తం ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పోటీ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అద్దంకి, చీరాల ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రెండు చోట్లా వైసీపీ బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది.

చీరాల‌లో పార్టీ మారిన జంపింగ్ నేత క‌ర‌ణంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి వ‌ర్గాలు బ‌లంగా ఉన్నాయి. జిల్లా మంత్రితో పాటు కొంద‌రు నేత‌లు బ‌ల‌రాం సీనియ‌ర్ కావ‌డంతో ఆయ‌న మాట కాద‌న‌లేక ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కే స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. అయితే జిల్లా పార్టీ పెద్ద‌ల స‌పోర్ట్ లేక‌పోయినా కూడా ఆమంచి చీరాల‌లో స‌త్తా చాటారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో త‌న సొంత ఫ్యానెల్‌తోనే 11 సీట్ల‌తో గెల‌వ‌డంతో పాటు వైసీపీ కంటే త‌న ఫ్యానెల్‌తో ఎక్కువ శాతం ఓట్లు సాధించారు.

క్యాస్ట్ ఈక్వేష‌న్ల ప‌రంగా ఇక్క‌డ క‌మ్మ వ‌ర్గానికి ఛాన్స్ లేద‌ని వైసీపీలో వినిపించే టాక్ ? ఇక్క‌డ రెండు వ‌ర్గాల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చి ఆమంచికి చీరాల ఇచ్చేయాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యార‌ట‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌రాం పోటీ చేసే అవ‌కాశం లేదు. ఆయ‌న త‌న‌యుడు క‌ర‌ణం వెంక‌టేష్‌కు అద్దంకి ఇవ్వ‌డం ఖాయ‌మైంది. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ స్ట్రాంగ్‌గా ఉన్నారు.

అక్కడ కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పాటు బ‌ల‌రాం గ‌తంలో ఎమ్మెల్యేగా గెలిచిన సీటు. అక్క‌డ రెండు ద‌శాబ్దాలుగా బ‌ల‌రాం రాజ‌కీయం చేస్తున్నారు. క‌మ్యూనిటీ ఈక్వేష‌న్లు కూడా బ‌ల‌రాంకు, ఆయ‌న త‌న‌యుడికి అనుకూలంగా ఉన్నారు. త‌న సామాజిక వ‌ర్గంలో ఆయ‌న ప‌ట్టు జార‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉన్నాడు. అక్క‌డ ప్ర‌స్తుత వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణ చైత‌న్య‌కు మ‌రోసారి నామినేటెడ్ ప‌ద‌వే ఇస్తార‌ట‌.

ఇటీవ‌ల జ‌గ‌న్ కూడా క‌ర‌ణం ఫ్యామిలీని అద్దంకి పంపాల‌ని ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో తీర్మానించ‌డం కూడా జ‌రిగింది. ఇక చీరాల‌లో టీడీపీ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ద్మ‌సాలీ నేత గంజి చిరంజీవికి సీటు ఇస్తార‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: