జగన్‌పై పోరాటం సరే.. రఘురామ ఫ్యూచర్‌ ఏంటి..?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్న నేతల్లో సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒకరు. మిగిలిన పార్టీల వాళ్లు, విపక్షాల నేతలు అయితే.. రెండు, మూడు రోజులకోసారి విమర్శలు చేస్తుంటారు. ఇష్యూ వచ్చినప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటారు. అయితే.. వీరు కూడా అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంటారు. కానీ.. ఎలాంటి గ్యాప్ ఇవ్వకండా వైసీపీ సర్కారుపై కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు అని చెప్పుకోవచ్చు.

జగన్ పార్టీ తరపునే ఎంపీగా రఘురామ కృష్ణంరాజు గెలిచినా.. ప్రస్తుతం మాత్రం జగన్‌కు బద్ద వ్యతిరేకి అన్న ముద్రను ఎంపీ రఘురామ కృష్ణంరాజు మోస్తున్నారు. ప్రభుత్వంపై మిగిలిన విపక్షాల సంగతి ఎలా ఉన్నా.. డిల్లీలో ఉన్నా.. హైదరాబాద్‌లో ఉన్నా.. వీలైనంత వరకూ రోజుకో సారో.. రెండు రోజులకోసారో మీడియాలో ప్రత్యక్షం కాకపోతే రఘురామ కృష్ణంరాజుకు నిద్రపట్టదేమో.

వైసీపీ ఎంపీగా గెలిచిన కొన్నిరోజలకే రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీతో మంచి సంబంధాలు కోల్పోయారు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ.. రఘురామ కృష్ణంరాజు మాత్రం మొదటి నుంచే జగన్ సర్కారుపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఆయన వాస్తవానికి పార్టీకి రాజీనామా చేయవచ్చు. అలా చేయడం ద్వారా సాధించిందేమీ ఉండదని భావించిన రఘురామ కృష్ణరాజు.. ఇప్పుడు ప్రత్యర్థలు బలహీనతలను అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నారు.

మరి ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు ఫ్యూచర్‌ ఏంటి.. త్వరలోనే తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి సత్తా చాటుతా అంటున్నారు రఘురామ కృష్ణంరాజు.. వాస్తవానికి రఘురామ కృష్ణంరాజు పోటీ చేయదలచుకుంటే ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయాలి. కానీ ప్రస్తుతం ఆయనకు ఏ పార్టీ కూడా టికెట్‌పై భరోసా ఇవ్వలేదు. ఇక స్వంతంత్ర అభ్యర్తిగా బరిలో దిగితే.. ఏమేరకు విజయం సాధిస్తారన్నది చెప్పలేం.. అందుకే.. అందరితోనూ మంచిగా ఉంటూ.. ఎన్నికల్లో వైసీపీకి చెక్  పెట్టాలన్నది రఘురామ కృష్ణంరాజు ఆలోచన. మరి అది వర్కవుట్ అవుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: