ఏపీలో టీడీపీ ప్లేసును బీజేపీ ఆక్రమిస్తోందా..?


ఏపీలో వైసీపీ అధికార పార్టీ.. ఈ విషయంలో అనుమానం ఎవరకీ లేదు.. మరి ప్రతిపక్షం ఎవరు.. ఈ ప్రశ్నకు కూడా చాలామంది తడుముకోకుండా సమాధానం చెబుతారు. అది తెలుగు దేశం పార్టీ అని.. అయితే.. కొన్నిరోజులుగా రాష్ట్రం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే.. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తెలుగు దేశం పార్టీ.. వచ్చే ఎన్నికల్లో సెకండ్ ప్లేస్‌ కూడా కోల్పోతుందా అన్న అనుమానం వస్తుందంటున్నారు కొందరు పాత్రికేయులు.

ఎందుకంటే... ఏపీలో కొన్నిరోజులుగా బీజేపీ చాలా దూకుడు ప్రదర్శిస్తోంది. అనేక విషయాల్లో తన వాదనను కుండబద్దలు కొడుతోంది. అంతే కాదు.. బీజేపీ నేతలు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో కాస్త హుషారు గానే ఉంటున్నారు. ఆశావాహ దృక్పథంతో పని చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఏపీలోనూ అధికార పార్టీ వైసీపీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో కాకుండా దాని తోక పార్టీలకు ప్రాధాన్యం ఇస్తోంది. సమయం దొరికితే ఏపీలో పెద్దపార్టీగా అవతరించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

అయితే.. కొన్నిరోజులుగా టీడీపీ కూడా డల్‌గా ఉంటోంది. ఓవైపు జగన్ సర్కారు తప్పులు మీద తప్పులు చేస్తున్నా.. వాటిని ఫోకస్ చేయడంపై తెలుగు దేశం అంతగా దృష్టి సారించలేకపోతోంది.   ఈ పరిణామాల కారణంగా ఏపీలో బీజేపీ బాగా హైలెట్ అవుతోంది. రాజకీయంగా సవాళ్లు కూడా రెండు, మూడు రోజులుగా వైసీపీ వర్సెస్‌ బీజేపీ అన్నట్టుగా సీన్ సాగుతోంది. ముందు బీజేపీ ఏపీ అధ్యక్షుడు వీర్రాజు.. ప్రజాబహిరంగ సభలో 70 రూపాయలేక చీప్ లిక్కర్ ఇస్తామని ప్రకటించిప్పటి నుంచి వీర్రాజు వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి.

ఆ తర్వాత బీజేపీ గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలని కొందరు.. అబ్బెబ్బే కూల్చి పారేయాలని మరికొందరు బీజేపీ నేతలు రోజూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇలా అనేక విషయాల్లో ఇప్పుడు వైసీపీని నిలదీస్తోంది బీజేపీ మాత్రమే.. ఇలా బీజేపీ ఏపీలో ప్రతిపక్షం టీడీపీ పాత్రను పోషిస్తోంది. ఈ విషయంలో బీజేపీ విజయవంతం అయితే.. ఏపీ టీడీపీ పని గోవిందా అవుతుంది. మరి టీడీపీ నేతలు ఇకనైనా మేలుకుంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: