గోడు : రాయల సీమ డిమాండ్ లివే


నీళ్లు, నిధులు, నియామకాలు డిమాండ్ తో ఉద్భవించినది తెలంగాణ ఉద్యమం.  తెలంగాణ నేతలు సూదీర్ఘ పోరాటం తరువాత తాము అనుకున్నది సాధింంచారు. ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.  రతనాలు రోడ్లమీద పోసి విక్రయించినట్లు చరిత్ర చెబుతున్న రాయల సీమ ప్రాంతం నీటి కట కట లను ఏదుర్కోంటోంది. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ను గానీ, విభజన తరవాతి ఆంద్ర ప్రదేశ్ పాలకుల్లో ఎక్కువ మంది రాయలసీమ వాసులే  ముఖ్యమంత్రులుగా రాజకీయాలలో చక్రం తిప్పారు. ప్రస్తుతం రాయల సీమ బిడ్డే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రీగా ఉన్నారు. అయనా సీమ వాసులు కష్టాలు తీరడం లేదు.
రాయలసీమకు ఉన్న సాగునీటి హక్కులు, వనరులు, అవకాశాలు  బాహ్య ప్రపంచానికి అంతగీ తెలియవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు కారణాలు అనేకం. రాయలసీమలో వర్షపాతం తక్కువ, నీళ్లు లేవు,  దీంతో ఈ ప్రాంతంలో ఎప్పుడూ కరవు తాండవ మాడుతుంటుంది. సేద్యం పనులు అరకొర ఉండటంతో ఇక్కడి జనం అంతా పొట్టకూటికోసం వలస పోవాల్సిన పరిస్థితి. ప్రకృతే చిన్నచూపుచూపడంతో  మన ప్రాంతం వాడు ముఖ్యమంత్రీగా ఉన్నా కూడా, వాడేం చేస్తాడు లే అన్న నైరాస్యం సీమ వాసుల్లో బలంగా పేరుకపోయింది. ఈ నిర్లప్తత  ఈ ప్రాంత సామాన్య ప్రజానీకానికే కాదు, రైతుల్లోనే కాదు,  పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు,  చిన్న చితకా కర్మాగాలున్న వాళ్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానుసలు కూడా తమకెందుకులే అని పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తుంగ భద్రా నది రాయలసీమలో ప్రవహిస్తున్నా కూడా అక్కడి నీటి ప్రాజెక్టులకు నలభై శాతం నీరు కూడా అందడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు  కృష్ణ, పినాకినీ నదులు కూడా రాయల సీమ గుండానే ప్రవహిస్తున్నాయి.  వీటిలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు  వెయ్యి టి.ఎం.సిల నీరు  రాయలసీమ గుండా ప్రవహిస్తుంది. బొట్టు నీరు కూడా రాయలసీమ వాసులకు అందడం లేదు.
 ఇక్కడి పరిస్థితిని అధ్యయనం చేసిన మేధావులు సామాజిక వేత్త బొజ్జా దశరథ రామి రెడ్డి నేతృత్వంలో 2011 లోనే రాయలసీమ సాగునీటి సాధన సమితి ని ఏర్పాటు చేశాారు. ఈ కమిటీ  రాయలసీమ ప్రజల ఆలోచనల్లో  కొంత మార్పును తీసుకు వచ్చింది. రాయలసీమలో ఉన్న వివిధ ప్రజాసంఘాలను ఒక తాటి మీదుకు తీసుకువచ్చింది. రాయలసీమలో సాగునీటి పరిస్థితి, అందుబాటులో ఉన్న వనరులు, సీమ వాసులకున్న హక్కులను వివరించేప్రయత్నం చేసింది. సీమ ప్రజలు తమపై తమకు నమ్మకం పెంచుకోవడానికి, వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి  పలు కార్యక్రమాలుచేపట్టింది.
ప్రసుతం రాయలసీమ వాసులు ఆంధ్ర ప్రదేశ్ నుంచి గొంతెమ్మ కోర్కెలు ఏమీ ఆశించడం లేదు. తమకున్న హక్కులను మాత్రం లభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో చర్చలు జరిపాలి. ఆర్.డి.ఎస్ కుడి వరద కాలువ నిర్మాణంతో వృధా అవుతున్న తుంగభద్రా వదర జలాలను కరువు సీమకు అందించాలి.అంతేకాదు తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణం చేపట్టాలి. దీని ఫలితంగా ప్రపంచంలోనే శాశ్వత కరువు ప్రాంతంగా పేరుపొందిన అనంతపుం జిల్లాకు సాగునీరు, తాగునీరు లభిస్తుంది.ఈ జిల్లా సస్య శ్యామలం అవుతుంది.
ప్రస్తతం ఆంధ్ర ప్రదేశ్ పాలకుడు కూడా రాయలసీమ వాసే. ఇక్కడి సీమకు గతంలో పాలకులు చేసిన అన్యాయం ఆయనకు తెలియంది కాదు. ఇక్కడి వాసుల కన్నీళ్లు ఆయనకు ఎరుకే. కాని అభివృద్ధి పనుల జాడ లేదు. కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఇదీ రాయలసీమ వాసుల గోడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: