జగన్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు కూల్చగలరా..?
ఇప్పుడు జగన్ సర్కారు కూడా ఉద్యోగుల విషయంలో ఘర్షణ వైఖరితో వెళ్తోంది. అసలు జగన్ సర్కారు ఉద్యోగులను కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదని సాక్షాత్తూ ఉద్యోగ సంఘాల నేతలే బహిరంగంగా అంటున్నారు. ఒకటో తారీఖున జీతం తీసుకోవడం తమ హక్కు అని.. దాన్ని కూడా జగన్ కాలరాస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అంతే కాదు.. ఇంకొందరు ఉద్యోగ సంఘాల నేతలు.. ఇంకో అడుగు ముందుకేసి... జగన్ సర్కారును కూల్చేస్తాం అంటూ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం- ఉద్యోగుల సంబంధాలపై మరోసారి చర్చ నడుస్తోంది.
అయితే.. అసలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వాలను కూల్చగలరా.. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానలను నిలబెట్టగలరా? అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం ప్రశ్నించడాన్ని ఏమాత్రం తప్పుబట్టలేం.. అలాగే తమకు రావాల్సిన పీఆర్సీల గురించి.. ఇతర హక్కుల గురించి తప్పకుండా ప్రశ్నించవచ్చు.. ప్రభుత్వంతో చర్చించవచ్చు. కానీ.. ఏకంగా తామే ప్రభుత్వాలను కూల్చేస్తాం అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. అసలే జగమొండిగా పేరున్న జగన్.. మరి ఈ ఇష్యూను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఇప్పటికే ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న జగన్ సర్కారు ఉద్యోగుల కోర్కెలన్నీ తీర్చగలదా.. వారిని సముదాయించగలదా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?