రైతు గుప్పిట్లో : పొలాలకు కావల్సింది తాయిలాలు కాదు

రైతులకు ఎం కావాలి ?  ఈ ప్రశ్నకు ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేరు. పోనీ పొలానికి ఎం కావాలి? ఈ ప్రశ్నకు  సమాధానం మాత్రం చాలా చాలా వస్తుంది. ఎందుకంటే ఎవరికి తోచింది వారు చెప్పుకొస్తారు. కొందరు నీరు కావాలంటారు ? మరి కొందరు నారు కావాలంటారు. ఇంకోందరు సత్తువ కావాలంటారు. పొలం గట్టు ఎట్లా ఉంటుందో చూడని వారుమాత్రం చేప్పేది  సబ్సిడీలు కావాలంటారు... వారికి ఏమి కావాలో ఎవరూ చెప్పరు. ఇదీ మన భారతం.
వ్యవసాయ ఆధారిత భారత దేశంలో రైతులు నేడు ఓ పెద్ద ఓటు బ్యాంక్.  ప్రతి ఒక్కరూ రైతులపై ప్రేమ ఒలకబోసే వారే. చట్ట సభల్లో అయితే ప్రతి ఒక్కరూ రైతు ప్రేమికులే. ప్రతి రాజకీయ పార్టీ అజెండా లో తప్పకుండా దర్శనమిచ్చే అశం రైతులు. రైతు సమస్యలు
దేశంలో ఆహార ఉత్పత్తి ఎలా పెంచాలి అన్న అంశం పై చర్చ నిర్వహిస్తే పగలూ రాత్రీ తేడా లేకుండా నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. ఆహార ఉత్తత్తి పెరగాలి. రైతుల కష్టానికి నిజమైన రోఖ్ఖం దక్కాలి. రైతు పండించిన ఉత్తత్తికి కనీస మద్దతు ధర లభించాలి. అదే సమయంలో  రైతులు, ప్రజలు కొనుగోలుచేసే ఆహార ధర ల పెరుగుదల నియంత్రణలో ఉండాలి. అప్పడే సమతుల్యం సాధ్యమవుతుంది. బహిరంగ మార్కెట్ లో ఆహార వస్తువులను, ఉత్పత్తులను మరింతగా అందుబాటు లోకి తీసుకురావాలి. దీనికి ఎం చేయాలి ? రైతుల నుంచి చివరగా కొనుగోలు చేసిన పంట ధరకు కనీసం ఐదు నుంచి పది శాతం  ఎక్కు వ ధర రైతులకు చెల్లించాలి. గిడ్డంగులలో ఎక్కువ రోజులు ధాన్యం, ఇతర పంటలు  నిల్వ ఉంచకుండా మార్కెట్ కు తరలించాలి. వాటి స్థానంలో తాజాగా పండిన పంట దిగుబడులను గిడ్డంగులలో ఉంచేందుకు  చర్యలు తీసుకోవాలి.  అంతే కానీ పొలాలకు తాయిలాలు ఇవ్వడం కాదు.
 ప్రస్తుతం పాలకులు చేస్తున్నదేమిటి ? చట్ట సభల్లోవారి వ్యవసార శైలి ఎలా ఉంది.   ప్రతి ఒక్కరూ  కర్షకులను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని భావిస్తున్న వారే.. . రైతులూ తస్మాత్ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: