ముందస్తు ఎన్నిక : గెలుపు గుఱ్ఱాల అన్వేషణలో పార్టీలు


ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రానున్నాయి. కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఈ మాట అనింది అధికార పార్టీ నేతలు కాదు. ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల ఆయన తన సొంత నియోజక వర్గం కుప్పంలో  పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు  ఈ విధమైన పిలుపుని చ్చారు. ఈ విషయానికి మీడియా పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వ లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల పై  పరోక్షంగా సూచనలు చేశారనే వార్తులు వెలువడ్డాయి.దీంతో అందరూ అలర్ట్ అయ్యారు. అధికార పక్షమే శాసన సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగ నియమం కూడా కావడంతో  ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.
 ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని ఎన్నికల నుంచి ట్రండ్ మారింది. గతంలో పార్టీని నమ్మకుని ఉండే వారికి , పార్టీకిి సేవ చేసిన  వారికి ఎన్నికల్లో టికెట్లు కేటాయించే వారు. గెలుపు ఓటముల ప్రభావం ఆయా రాజకీయ పార్టీలదే. అది  ఆ పార్టీలకు , వారి పాలనకు రెఫరెండం గా ఉండేది. కానీ నేటి రాజకీయాలు ఆ ట్రెండ్ ను మార్చాయి. పార్టీని నమ్మకున్న వారికి  ఎన్నికలలో టికెట్లు వస్తాయన్న గ్యారంటీ ఏ మీ లేదు.  గెలుపు గుర్రాలకు మాత్రమే వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికలలో టికెట్లు కేటాయిస్తున్నాయి.  
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు  ప్రభుత్వంలోని ఇంటలిజెన్స్ శాఖను పూర్తిగా తమ సొంతానికి వాడుకుంటాయనే అపవాదు ఉంది. వారి  ఇచ్చే నివేదిక ఆధారంగా  టికెట్లు కేటాయించిన దాఖలాలు ఆంధ్ర ప్రదేశ్ లో చాలా నే కనిపిస్తాయి. అధికారంలో లేని వాళ్లు ఇక ఇతరులపై ఆధార పడతారు. ఎన్నికల విశ్లేషకుల నివేదిక ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు ప్రతి రాజకీయ పార్టీ కూడా  ఎన్నికల విశ్లేషకులతో ఎం.ఓ.యు కుదుర్చుకుని ఉంది. ఇది  అందరికీ తెలిసిన  బహిరంగ రహస్యం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల విశ్లేషకుడు ప్రశాత్ కిశోర్  తమ వ్యూహకర్త అన్ని ఎప్పుడో బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్యర్యంలో పడేశారు. ఆయన చేసిన సూచనల ప్రకారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అఖండ విజయం నమోదు చేసుకున్నారు.  గత కొన్ని మాసాలుగా ఆయన టీం రాష్ట్రంలో పర్యటించింది.  ప్రభుత్వం, నేతల ఎన్నికత తీరుపై ప్రజల  అంతరంగాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీం వాటిని  విశ్లేషించే పనిలో పడింది. రానున్న ఎన్నికల్లో  గెలుపు గుఱ్ఱాలను అన్వేషించే పనిలో పడింది. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు కూడా ఇప్పటికే రెండు సార్ల ఎన్నిక విశ్లేషకుల చేత సర్వే చేయించినట్లు ఆ పార్టీ శ్రేణులే పేర్కోంటున్నాయి. రానున్న ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిందని, వారిలో కొందరి  పేర్లను త్వరలోనే  తమ అధినేత వెల్లడిస్తారని టిడిపి శ్రేణులు పేర్కోంటున్నాయి. ముందస్తు ఎన్నిక మాట ఎలా ఉన్న రాజకీయ పక్షాలు  గెలిచే అభ్యర్థుల వేటలో పడ్డాయన్నది మాత్రం సుస్పష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: