టి కాంగ్రెస్ లో కాక మొదలైంది

టి కాంగ్రెస్ లో కాక మొదలైంది
ఎంకి పెళ్లి...సుబ్బిచావుకొచ్చిందన్నది తెలుగు రాష్ట్రాలలో   వాడుకలో ఉన్న సామెత. హుజూరా బాద్ ఉప ఎన్మిక కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కాక రేపింది. నేతలకు తలనొప్పి తెచ్చి పెట్టింది.  పంచ్ డైలాగులతో ప్రజల్ని ఆకట్టుకునే  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి  స్వంత పార్టీ నుంచే షాక్ తగిలింగి. హుజూరా బాద్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత మేర కృషి చేయలేదని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, అసమ్మతి నేత  కోమటి రెడ్డి వెంకట రెడ్డి బాహాటంగానే  విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఆ పార్టీకి బలం, బలహీనత కూడా. ఒకరంటే పడని కార్యకరక్తలను ఆదే పార్టీకి చెందిన మరో నేతలు చేరదీస్తుంటారు. అలా సమ్మతి వాదులను, అసమ్మతి వాదులను ఇద్దరినీ బుజ్జగిస్తుంటారు. అదే కాంగ్రెస్ పార్టీ రాజకీయం. స్వంత పార్టీలో ఎవరు ఎవరిపై విమర్శలకు దిగిగా పార్టీ హై కమాండ్ మాత్రం ఏమీ అనదు. క్రమశిక్షణా చర్యలు అసలుండవు. కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు దగ్గరగా పరిశీలించిన వారికి ఇది పూర్తిగా తెలిసిన విషయం. పైగా దీనిని అంతర్గత ప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ పేర్కోంటుంటుంది.
హుజూరా బాద్ ఉప ఎన్నిక  కాంగ్రెస్ పార్టీకి,  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన  రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకం అని ఆ పార్టీ నేతలు తొలుత బాహాటంగా ప్రకటన లిచ్చారు.  తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ప్రచారం జరిగింది. ఎన్నికా పూర్తయింది. కౌంటింగ్ మొదలైంది. కాక పోతే  వెలువడుతున్న ఫలితమే  పెద్ద పెద్ద నేతల్ని ఖంగు తినిపించింది. చెప్పుకో తగ్గ స్థాయిలో ఆ పార్టీకి ఓట్లు రాలేదు. సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏమైందని పార్టీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు.
వివిధ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ లో ప్రధాన పోటీ టి.ఆర్.ఎస్ వర్సెస్ బి.జె.పిఅని తెల్చి చెప్పాయి. మరి కొందరు ఎన్నికల పరిశీలకులు  పోటీ పార్టీలది కాదు వ్యక్తుల మధ్య పోటీ అని పేర్కోన్నారు. ఈ ఎన్నిక ముఖ్యమంత్రి కేసిఅర్ వర్సెస్ ఈటల రాజేందర్ అని తెలిపాయి.  ఏ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ ను కానీ, ఆ  పార్టీ అభ్యర్థిని కాని పరిగణ లోకి తీసుకో లేదు.  అయితే , తమ సంప్రదాయ ఓటు బ్యాంక్ ఎక్కడా చెక్కుచెదరదు కదాా అని ఆ పార్టీ శ్రేణులు  నిబ్బరంగా ఉన్నాయి. కాగా తాజా ఫలితాలు ఆ పార్టీ నేతలను ఖంగు తినిపించాయి.


హుజూరా బాద్ ఉప ఎన్నిక ఫలితాల పై  ఆ పార్టీ  పార్లమెంట్ సభ్యుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తొలుత గా స్పందించారు. కాంగ్రెస్  కార్యకర్తలు అధైర్య పడవద్దని చెప్పారు. సిట్టంగ్ శాసన సభ్యుడుగా ఉన్న ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసి నెలలు గడచినా కాంగ్రెస్ పార్టీ ఒక్క సభ కూడా నిర్వహించ లేదని విమర్శించారు. కార్యకర్తలను పట్టించు కోలేదని విమర్శించారు.  ఎన్నిక ల నోటిఫికేషన్ వచ్చాక గానీ  కాంగ్రేస్ పార్టీ నిద్ర లేవ లేదని చెప్పారు.  కాంగ్రెస్ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అన్నారు. ఉప ఎన్నికల పై క్షేత్ర స్థాయి రిపోర్టును  హై కమాండ్ కు అందజేస్తానని, వాస్తవ పరిస్థితులను  వివరిస్తానని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రకటించారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు  ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: