ఆర్కే మ‌ర‌ణం : నేల త‌ల్లి ఒడిలో..అరుణ ప‌తాక శ్వాస

RATNA KISHORE

మ‌నుషులంతా ఒక్కొక్క‌రుగా నేల‌కు చేరి నింగికి విన్న‌పం రాస్తారు. నేల‌కు చేరి తార‌లుగా మారేందుకు ఒక ప్ర‌యాణం చేస్తారు. చీక‌టి నుంచి ఆక‌లి  నుంచి కాంతి రేఖ‌లను దుర్గమ తీరాల‌కు చేర్చేందుకు త‌మంతట తాము శ్ర‌మిస్తూ, ఇత‌రుల శ్ర‌మ‌నూ అందుకు సాయం తీసుకుంటారు. నేల ఒడి కి చేరుకున్నాక  మ‌నిషి హ‌క్కు మ‌ళ్లీ జ‌న్మించ‌డం. బాధ్య‌త మ‌నిషిగా బ్ర‌త‌క‌డం..

క‌ర్త‌వ్యం మ‌నిషిత‌నం కోసం ప‌రిత‌పించి బ్ర‌త‌క‌డం.. మీ బిడ్డ‌ల‌కు ఇవ‌న్నీ నేర్పండి. అడ‌వి ర‌క్ష‌ణ‌, ప్ర‌కృతి ర‌క్ష‌ణ‌, మ‌నిషి హ‌క్కు, సామాజిక బాధ్య‌త..ఇవ‌న్నీ వీటి త‌రువాత మీరు తూటా పోరు కోసం వివ‌రించండి. అడ‌వి అంటే అమ్మ అని ఇప్ప‌టికైనా నేర్పండి ఏం కాదు.. మీకు చేత‌గాక పోతే మీ బిడ్డ‌ల త‌ప్పుల‌ను మీ నెత్తిన పెట్టుకుని మాత్రం ఊరేగ‌కండి. వీరులకు జ‌న్మ ఇస్తే త‌ల్లిదండ్రుల గౌర‌వం పెరుగుతుంది. వీరుల‌ను స‌మాజం కోస‌మే త‌యారు చేస్తే ఓ త‌రం చ‌రిత్ర‌లో ఉంటుంది. ఉద్య‌మం అన్న పెద్ద ప‌దం అంద‌రికీ వ‌ర్తించ‌దు కానీ క‌నీస స్థాయిలో హక్కుల కోసం మాట్లాడించండి చాలు. మీ చుట్టూ ఉన్న మానవ మృగాల తీరు వివ‌రించి, ప్ర‌భుత్వాల తీరును వివ‌రించి ప్ర‌శ్నించ‌డం నేర్పండి చాలు..ఇవేవీ చేయ‌కుండా మీరు చావొద్దు.. ఇవేవీ చేయ‌కుండా మీరు బ‌త‌కొద్దు కూడా!
తెలుగు రాష్ట్రాల‌లో రామ‌కృష్ణ అన్న పేరుకు ఆయ‌న‌తో ఉన్న కొన్ని అనుబంధాల‌కు చెల్లు చీటి రాసి పోవ‌డం జ‌ర‌గ‌ని ప‌ని. మ‌నం మాట్లాడుకునేంత శ‌క్తి, మనం స్మ‌రించుకునేంత శ‌క్తి ఒక ఉద్య‌మం అందించి వెళ్లింద‌న్న ప్ర‌తిపాద‌న ఒక‌టి మావో పోరులో ఉంది. విప్ల‌వం కొన్ని ప్ర‌తిపాద‌న‌లు అందిస్తుంది. ఒక రోజు నుంచి ఒక త‌రం వ‌ర‌కూ, ఒక త‌రం నుంచి ఒక స్వ‌ప్నం వ‌ర‌కూ, ఒక దేహం నుంచి ఒక ప్ర‌పంచం వ‌ర‌కూ విస్తృతిని పొందే ఉంటుంది. ఉద్య‌మానికి సానుభూతి ప‌రులు ఉంటారు. సైద్ధాంతిక దృక్ప‌థాల‌ను బ‌ల‌ప‌రిచేవారు ఉంటారు. వ్య‌తిరేకించే వారూ ఉంటారు. అన్నీ ఉంటేనే క‌దండి అడ‌విలో దండు క‌దిలేది. ద‌ళం క‌దిలేది. గొంతు పెకిలేది. లేదా ప‌లికేది. ఇప్పుడు ఆర్కే చ‌నిపోయారు అనారోగ్య కార‌ణం రీత్యా అయినా స‌రే ఉద్య‌మం మాత్రం ఆగ‌దు అని అంటున్నారు ఆయ‌న జీవ‌న స‌హ‌చ‌రి శిరీష‌.

విప్ల‌వం ఏద‌యినా ఈ నేలతో పంచుకున్న బంధాన్ని తెంప‌దు. పేగు బంధాల‌న్న‌వి తెగిపోవు. ఉద్య‌మాల‌కు ఉన్న సైద్ధాంతికత అన్నది అన్ని వేళ‌లా ప్రామాణిక న‌డ‌వ‌డిని అందిచ‌క‌పోయినా, ఏదో ఒక రోజు కొన్ని మార్పుల‌కు అది కార‌ణం అయి తీరుతుంది. పాల‌క ప్ర‌భుత్వాల‌కు, అడ‌విలో ఉన్న సాయుధ అన‌ధికార స‌ర్కారు (మావోయిస్టుల‌ కూ) మ‌ధ్య యుద్ధం ఆగిపోయింద‌న్న‌ది ఓ వాద‌న. ఓ అపోహ కూడా! క‌డ‌దాకా ఆగిపోయేవి ఏవీ ఉండ‌వు. క‌డ‌దాకా తోడుండేవీ ఏవీ ఉండ‌వు. మ‌నుషులపై ప్రేమ మ‌నిషిని మ‌నిషి లా అర్థం చేసుకోవాల‌న్న ప్రేమ కొన్ని సార్లు ఓడిపోదు. అన్ని సార్లు గెలిచి రాదు. అయినా వ‌ర్గ పోరును సైద్ధాంతికంగా చూడ‌డం స‌మాజానికి ఇంకా నేర్పాలి. ఈ విధంగా అయినా స‌మాజం త‌న త‌ప్పులు దిద్దుకోవాలి. క‌డ‌దాక ప్రాణం ఏం కోరుకుంటోంది అన్న ఎవ‌రికి వారే తెలుసుకుని తీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: