గెట్ వెల్ సూన్ : సాయి ధ‌ర‌మ్ కోలుకో !

RATNA KISHORE
ఉద‌యం వేళ జూబ్లీహిల్స్ అమ్మ‌వారి కోవెల‌లో నీ కోసం ప్రార్థిస్తున్న అభిమానికి అండ‌గా ఉండాలి..నువ్వు మ‌ళ్లీ ప‌ల‌క‌రించాలి. పెద్దమ్మ త‌ల్లి దీవెన‌లు అందుకుని మ‌ళ్లీ సుప్రీమ్ హీరో అనిపించుకోవాలి. రియ‌ల్ స్టార్ అనిపించుకోవాలి. ఇది క‌దా మేం కోరుకునే ది. నీవు మ‌రింత శ‌క్తిని పుంజుకుని కొత్త సినిమాలు చేయాల‌న్న‌దే మెగాభిమానుల కోరిక‌. వారి కోరికను నెర‌వేర్చు. మ‌రిచిపోకు నీవు చిన్న చిత్రాల‌కు దొరికిన మెగాస్టార్ వి అని.. నీ న‌డ‌క న‌ట‌న నుంచి మావ‌య్య ల ప్ర‌భావాన్నీ , పోలిక‌ల‌నూ తీసేయ్య‌లేం. అందుకే గుణాలు కూడా మావ‌య్య‌ల‌వే అని డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ అన్నారు. పోలిక‌లు ఎవ్వ‌రికైనా వ‌స్తాయి కానీ గుణాలు రావ‌డ మే గొప్ప అని ఓ ఫంక్ష‌న్ లో నిన్ను ఉద్దేశించే చెప్పార‌య్యా!
 
మెగా కాంపౌండ్ అని రాయ‌డం త‌ప్పు.. ఏంటిది మేం కోరుకుంటున్న‌ది ఇది కాదు అని అంటాడు ప‌వ‌న్.. ఆయ‌న‌ను అనుసరించి వ‌చ్చిన వాడు సాయి ధ‌ర‌మ్ తేజ్ .. మొద‌టి సినిమా రేయ్ విడుద‌ల‌లో ఎన్ని క‌ష్టాలు చూశాడు త‌రువాత సినిమాల విష‌య‌మై అంతే శ్ర‌ద్ధ‌నూ చూపించాడు. క‌ష్టాలు అంటే సినిమా విడుద‌ల కాక క‌ష్టాలు.. క‌ష్టాలు అంటే డ‌బ్బులున్నా  కంటి మీద కునుకు లేని రోజులు.. ఆ త‌రువాత దిల్ రాజు త‌న‌వంతుగా ఆయ‌న‌కు ఓ కెరియ‌ర్ ఇచ్చాడు. వరుస సినిమాలు చేశాడు ఆ బ్యాన‌ర్ లోనే ! ఇప్పుడు దేవా క‌ట్టా మ‌రో సామాజిక బాధ్య‌త ఉన్న క‌థ‌ను తీసుకువ‌చ్చి రిప‌బ్లిక్ పేరిట చేస్తున్నాడు. ఆ సినిమా విడుద‌ల‌కు సిద్ధ మైంది. ఇంకొన్ని సినిమాలూ వ‌స్తున్నాయి. త‌మ్ముడు కూడా పోటీగా వ‌స్తున్నాడు. ఇన్ని ఆనందాల మ‌ధ్య నీవు ఇంకాస్త ఆనం దంగా ఉండాల‌ని కోరుకుంటున్నాం. తేజూ! ధైర్యంగా ఉండు. ఆప‌ద‌ల్లో మ‌నుషుల‌కు ధైర్యం ఒక్క‌టే అంతిమ ఆయుధం కావాలి. దేవుడి ఆశీస్సులు అందుకు తోడు.
ఇంకా పెళ్లి శుభ‌లేఖ‌ల వ‌ర‌కూ జీవితం వెళ్ల‌లేదు. చిన్న కుర్రాడు. మావ‌య్యల ప్ర‌భావంతో న‌టిస్తూ మెల్ల‌మెల్ల‌గా ఎదుగుతున్నా డు. అలానే త‌గ‌వుల‌కు దూరంగా, వివాదాల‌కు దూరంగా వీలున్నంత త‌క్కువ బ‌డ్జెట్ లోనే సినిమాలు చేస్తూ నిర్మాత ను సేఫ్ జోన్ లో ఉంచుతున్నాడు. గొంతెమ్మ కోరిక‌లేవీ లేని హీరో.. మెగా కుటుంబం నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతు న్న చిన్న హీరో.. చిన్న హీరోల‌ కుటుంబానికి మ‌రో మెగాస్టార్. సాయం చేసే గుణంలో ప‌వ‌న్ ను ఫాలో అవుతాడు. న‌ట‌న‌లో మెగా స్టార్ ను ఫాలో అవుతాడు. ఈ రెండూ త‌న‌కు ఇష్టం ఉన్న ప‌నులు. ఇంకొన్ని కూడా ఇష్ట‌మ‌యిన ప‌నులు ఉన్నాయి. హాయిగా సెల‌వు రోజు బైక్ తీసుకుని న‌గ‌ర శివార్ల‌కు వెళ్లిరావ‌డంలో ఇష్టం ఉంది. అమ్మ‌ను ఎల్ల‌ప్పుడూ ఆనందంలో ఉంచ‌డంలో ఇష్టం ఉంది. అదేవిధంగా బాధ్య‌త‌గా ప‌వ‌న్ చెప్పిన మాట‌లు పాటించ‌డంలో ఇష్టం ఉంది. మీరు రండి కానీ క‌ష్ట‌ప‌డండి అని ఆ రోజు ప‌వ‌న్ చెప్పాడ‌ట ఓ మాట! సాయి ధ‌ర‌మ్ ను ఉద్దేశించి..అదే ఇప్ప‌టికీ ఫాలో అవుతున్నాడు. నిర్మాత‌ల‌నూ, తోటి న‌టుల‌నూ, ముందుండి న‌డిపే ద‌ర్శ‌కుల‌నూ గౌర‌విస్తూ, శ‌క్తి మేర‌కు క‌ష్ట‌ప‌డుతున్నాడు. కొన్ని సార్లు శ‌క్తికి మించి క‌ష్ట‌ప‌డుతున్నాడు. సాయి ధ‌ర‌మ్ నీవు మ‌రో మంచి సినిమా చేయాలి. రిప‌బ్లిక్ త‌రువాత నీ సినిమా ఇంకో స్థాయిని చేరుకోవాలి. ఇది క‌దా! అభిమానులు కోరుకుంటున్నారు.

వినాయ‌క చ‌వితి పండుగ ఆనందాలు అప్పుడే ఆగిపోయాయి ఆ కుటుంబంలో.. కేబుల్ బ్రిడ్జి స‌మీపాన జ‌రిగిన ప్ర‌మాదంలో సాయి ధ‌ర‌మ్ గాయాలు పాల‌వ్వ‌డంతో ఆందో ళ‌నే కాదు భ‌యం కూడా అంద‌రిలోనూ రెట్టింపైంది. సాయి ధ‌ర‌మ్ నిన్ను అంతా సుప్రీమ్ హీరో అం టారు క‌దా! ఆ మాట మ‌ళ్లీ అనిపించుకునేందుకు, చిరు పేరు మ‌ళ్లీ నిల‌ బెట్టేందుకు నీవు కోలుకోవాలి. నీకు అంతా మంచి జ‌రిగి తీ రుతుంది అని అభిమానులు చేసే ప్రార్థ‌న ఒక్క‌టి ఫ‌లించాలి. ఫ‌లితం ఇవ్వాలి.

ప్ర‌మాదాలు చెప్పి రావు. వ‌చ్చాక మ‌నం గాయాల పాల‌య్యాక కోలుకునే శ‌క్తి ఒక‌టి వెతుక్కోవాలి. దైవం అనుకూలంగా ఉండాల‌ని చేసే ప్రార్థ‌న ఒక్క‌టి సాయి ధ‌ర‌మ్ తేజ్ ను నిల‌బెడుతుంది. ఆయ‌న ప్రాణాల‌కు ఇంకొన్ని ప్రాణాల ఆశ‌లు తోడ‌వుతాయి. అపోలో వై ద్యులు కూడా ఆయ‌న కోసం ప్రార్థ‌న‌లు చేయాల‌నే చెబుతున్నారు. వారి మాట‌లు ప్ర‌ కారం 48 గంట‌ల సమ‌యం ఇస్తే కానీ తాము ఏమీ చెప్ప‌లేం అంటున్నారు. ఈ వేళ మీరంతా మెగా అభిమానులంతా ధైర్యంగా ఉంటూ ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి.
కోట్ల ప్ర‌జ‌లు నీ కోసం ఎదురు చూస్తున్నారు. కోటాను కోట్ల ఆశ‌లు నీ కోస‌మే ఎదురు చూస్తున్నాయి. నీవు కోలుకుని వారి ఆశ‌లు నెర‌వేర్చాలి. మ‌ళ్లీ సినిమా షూటింగ్ ల‌కు రావాలి. మ‌ళ్లీ నువ్వు మామ‌య్య లానే న‌టించాలి. ప‌వ‌న్ మ్యాన‌రిజ‌మ్స్ ను ప్ర‌క‌టిం చాలి. ఏదో ఒక‌టి చేసి అభిమానుల‌ను అల‌రించాలి. ఆప‌ద‌లో ఉన్న వారికి నీవు సాయం చేసి, అంద‌రి దీవెన‌లు అందుకోవాలి. విజ‌య‌వాడ‌లోనే కాదు వీలున్నంత వ‌ర‌కూ అనాథ‌ల‌కూ, వృద్ధుల‌కూ నీవు తోడు ఉండాలి. ఇది క‌దా కోరుకుంటున్నాం నీ నుంచి రావ‌య్యా.. నిన్ను ఏ గాయాలూ ఏమీ చేయ‌లేవు. నిన్ను ఏ శ‌క్తీ ఆప‌లేదు. నిన్ను ఏ శ‌క్తీ నిలువ‌రించనూ లేదు. గెట్ వెల్ సూన్ తేజ్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: