పర్యావరణాన్ని కాపాడేవారిని ఎందుకు చంపుతున్నారు?

Mekala Yellaiah
ఉత్తరప్రదేశ్ లో పర్యావరణాన్ని కాపాడుతున్న కొందరిపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్నో తరాలుగా చనిపోయిన జంతువుల ఎముకలను సేకరిస్తూ, వాటిని అమ్ముకొని బతుకుతున్నవారిని కొందరు చావబాదుతున్నారు. గోవధపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటి నుంచి అక్కడ ఎముకలు ఏరుకుంటూ బతుకుతున్నవారు భయం భయంగా గడుపుతున్నారు. ఎముకలు ఏరుకుంటున్నవారిని చూసి, వారే జంతువులను చంపుతున్నారనుకొని దాడులు చేస్తున్నారు. అక్కడ వేలాది మంది దళితులు ఈ పనిపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఎముకలు సేకరిస్తున్నవారిని గోవులను చంపుతున్నారని, వారంతా గోవధశాలల కోసం పనిచేస్తున్నారనుకొని దాడిచేస్తున్నారు. కళేబరాలతో కాలుష్యం పెరుగుతుంది. వాటిని సేకరిస్తుంటే తగ్గుతోంది. ఇలా పర్యావరణాన్ని కాపాడుతుంటే కొందరు వారిని చంపుతున్నారు. 

2017లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గోవధశాలలను మూసేశారు. అక్కడ 18 రాష్ట్రాల్లో గోవధపై నిషేధం ఉంది. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉండడంతో ఈ నిషేధం క్రియాశీలంగా అమలవుతోంది. అయితే ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్, కాన్పూర్, గోండా నగరాల్లో దళితులు ఎముకలను సేకరిస్తున్నారు. వాటిని వివిధ రసాయనాల ఫ్యాక్టరీలకు అమ్ముకొని, వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పూట గడుపుతున్నారు. కిలో ఎముకలు అమ్మితే మూడు నుంచి ఐదు రూపాయలు వస్తాయి. దాని కోసం వారు వందల కిలోమీటర్ల పరిసరాలను గాలిస్తున్నారు. కోసంరక్షణ పేరుతో కొందరు వీరిని కొడుతున్నారు. ఇలాంటి దాడుల్లో చాలా మంది దళితులు చనిపోయారు. మరణించినవారిలో ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. గోవులను చంపుతున్నారనే వదంతుల కారణంగానే దాడులు జరుగుతున్నాయి. ఈ భయానికే చాలా మంది ఉదయం పది గంటల లోపు పని ముగించుకుంటున్నారు. 

కుళ్లిపోయిన జంతు కళేబరాలను తొలగిస్తూ, మనుషులకు రోగాలు రాకుండా చూస్తున్న తమపై దాడులు చేస్తున్నారని దళితులు ఆవేదన చెందుతున్నారు. చనిపోయిన జంతువులను వెతుక్కుంటూ రోజూ వంద కిలోమీటర్లు కాలినడకన తిరుగుతున్నారు. ఎవరి ఇంట్లోనైనా జంతువులు చనిపోయినా వీరే ఊరు బయటకు తీసుకెళ్తారు. వీరు గోవులను చంపడంలేదు. చనిపోయిన వాటి ఎముకలనే ఏరుకుంటూ అమ్ముకుంటున్నారు. ఈ విషయం తెలిసినా చాలా మంది వారిపై దాడి చేస్తున్నారు. ఇక్కడ దళితులు పర్యావరణంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తున్నారు. దానికి బదులుగా వారిని చంపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: