కిశోరు - హుషారు : మేలు చేస్తే అంతా ప్రశాంతమే..

RATNA KISHORE
కాలికి కట్టు కట్టుకుంటే ఓట్లొస్తాయి ఈ మాట ఎక్కడో విన్నాను తెలియదు. మమతా రాజకీయం ఇదే కదూ! అలాంటిదేదో గతంలో నూ జరిగిందా! ఏమో! సానుభూతి రాజకీయాలు పనిచేస్తాయా దేశంలో! ఏమో! జగన్ ఓదార్పు ఫలించిన మాట వాస్తవమే కదా! అదంతా సానుభూతి రాజకీయమే. అప్పటికి జగన్ ప్రశాంత్ కిశోర్ కన్నా వెయ్యి రెట్లు బాగా ఆలోచించాడు. అందుకే సక్సెస్ అ య్యాడు. ఎందుకనో ప్రశాంత్ కిశోర్ సీన్ లోకి వచ్చాకనే జగన్ మారిపోయాడు అదే విడ్డూరం..కాదంటారా?


కార్పొరేట్ రాజకీయాల గురించి పూరీ జగన్నాథ్ సినిమా తీశాడు. పేరు - బిజినెస్ మెన్ .. అలాంటివాడే ప్రశాంత్ కిశోర్ అని చాలా మందికి అనుమానం. ఆ అనుమానం ఏ విధంగా ఉన్నా అతడు అలాంటివాడే ! డబ్బులు పంచడంలో నేర్పరి. నవరత్నాలను పం చమని చెప్పి జగన్ కు రాజకీయంలో కొత్త ఓనమాలు దిద్దించాడు. ఆ నవ రత్నాలు కాస్త ఇప్పుడు శతకోటి రత్నాలు అయ్యాయి. ఇంటికి లక్ష రూపాయలు ఇప్పటికీ చెల్లించాడని టాక్. ఓ అంచనా అని రాయాలి. అలానే రాస్తాను. ఇప్పుడిదే నవ రత్నాలకు మె రుగులు దిద్ది కాంగ్రెస్ తో ఉత్తరాది వాళ్లకు జొన్నలు, గోధుమలు మనకు పప్పు బెల్లాలు మళ్లీ పంచమంటాడు..అది నేరుగా కా కుండా నగదు రూపాన... ఇలాంటివేవో చెప్పి కాంగ్రెస్ ను నమ్మిస్తున్నాడు. షర్మిలను కూడా ఇలానే ఏదో ఒకటి చెప్పి నమ్మించా లి. లేదంటే వ్యూహకర్తగా అతడు పనికిరాడు. అవును నమ్మించడమే మొదటి పని. నమ్మడం అవతలి వారి పని. ఈ పనులు జర గకపోతే కిశోర్ ఉన్నా లేకున్నా ఒక్కటే బాబాయ్!


  
రెండు పార్టీలకు ఒకే వ్యూహ కర్త. ఆ విధంగా ముందుకు. రెండు పార్టీలకు ఒకే కాలమానంలో పరీక్ష ఆ విధంగా వెనక్కు. ముందు వెనుకల ఆట ఇది. గెలవడంలో ఆట .. ఓటమికి దగ్గరలో కూడా ఆట! ఓడిపోయినా కూడా ఆట ఆడాల్సిందే! రాజకీయం కానుకగా ఇచ్చే కొన్నింటిని మది గదిలో దాచుకోవాలి. కోపాలూ తాపాలూ అన్నవి కూడా కానుకలే. ఇవి ప్రజలు తమంతట తాము ఇచ్చేవి కనుక ఇంకాస్త ఎక్కువగా పరిగణించి దాచుకోవాలి. మనం పొందే వాటిపై ప్రేమ పెంచుకోవాలి. ఓటమి పొందారా మీరు ఇంకాస్త జాగ్రత్త! ఆ తరహా ప్రేమ కూడా ఒంటికి మంచిదే ! కాలం సోనియానూ షర్మిలనూ పరీక్షిస్తుంది. కాలం రోజానూ,  సీతక్కనూ ఏడిపి స్తుంది. కాలం రేవంత్ ను జగన్ ను వేర్వేరు దారుల్లో నడిపించి ఏదో ఒకటి చెప్పి పోతుంది. రేవంత్ సీఎం కావాలన్న కలకు సోనియా అడ్డంకి అయితే కాదు కానీ ఆ పదవి వీజీగా రాదు.

   
జగన్ మళ్లీ సీఎం  కావడానికి  ఆ రోజు సోనియా వెల్లడి చేసిన అభ్యంతరం ఏమో కానీ ఇప్పుడు చెప్పినా అది ఆగదు. ఇంతకూ సంతకాల సేకరణలో ఎవరు ఎక్కడ ఎందుకు జగన్ ను నిలువరించారు అంటారు ? ఏమో! అది కూడా తెలియదు. కానీ రఘువీరా మాత్రం తెరపైకి వచ్చి మాట్లాడడు. మాట్లాడితే సమస్యలు క్లియర్ అయిపోతాయి. రాయలసీమ నీళ్ల కోసం రఘువీరా మాట్లాడాలి. పోనీ తానెందుకు సైలెంట్ అయిపోయానో అన్నది  కూడా మాట్లాడాలి. ఇవన్నీ కానప్పుడు టీడీపీ గూటికి పిలుపు వచ్చినా తానెం దుకు పోలేదో మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడాలి. పోనీ తాజాగా కొత్త వాడు ఒకడు వచ్చాడుగా ఆయనతో అయినా ప్రశాంతంగా మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి.

అవును! కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వేళ వ్యూహాలు నేర్పే ప్రశాంత్ కిశోర్  ఇప్పుడు తెరపైకి వచ్చాడు. ఆయన అటు జగన్ కు ఇటు షర్మిలకు వ్యూహకర్త . సాయిరెడ్డి కి ఆయన మాటే వేదం. అలాంటి లీడరు లీటర్ల కొద్దీ తేనె తాగిస్తారని కాంగ్రెస్ నమ్మకం. ఆ తేనె పంపకంలో భాగంగానే కాంగ్రెస్ కొందరిని నమ్ముకుంటుంది. పాత స్నేహితులను కలుపుకుంటుంది. కాంగ్రెస్ పాత స్నేహితులకు విలువ ఇచ్చి తన తప్పులు దిద్దుకుంటే జగన్  కాంగ్రెస్ - సోనియా కాంగ్రెస్ ఒక్కటి కావొచ్చు. చంద్రబాబు టీడీపీ -  సోనియా కాంగ్రెస్ ఒక్కటి  కావొచ్చు. ఇలాంటివెన్నో జరిగేందుకు ఆస్కారం ఉన్న ఈ ఎన్నికలు షర్మిలను ఒంటరిని చేయకుండా ఉంటా యా? ఉంటే ఉంటాయి లేకుంటే లేదు. షర్మిల కూడా ప్రశాంత్ బాబాయ్ నే నమ్ముకుంది సారీ అన్ననే నమ్ముకుంది. నమ్ముకు న్నవన్నీ నెగ్గాలని కోరుకోవాలి. ఆ విధంగా గతంలో నమ్ముకున్న కారణంగా జగన్ రాజకీయంలో గెలిచాడు. ఆ విధంగా బాబు చెప్పిన వినకుండా ముందుకు పోయాడు. ఇప్పుడు కూడా జగన్ కలలూ, సోనియా కలలూ, షర్మిల కలలు, రేవంత్ కలలు నెర వేర్చేది ప్రశాంత్ కిశోరే అని ఓ టాక్.........అవుతుందో లేదో !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: