టీడీపీ సై అంది.. వైసీపీ నై అంది.. వెటకారం మిగిలింది..?

విశాఖ ఉక్కు అంశం మరోసారి వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. విశాఖ ఉక్కు కోసం అవసరమైతే టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసేందుకు కూడా సిద్దమని ఇప్పటికే చంద్రబాబు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కావాలంటే.. జగన్ ముందుండి విశాఖ ఉక్కు పోరాటాన్ని నడిపించాలని కూడా చంద్రబాబు సవాల్ విసిరారు.. అయితే.. ఈ సవాల్ విషయంలో మాత్రం వైసీపీ చాలా సంయమనం పాటిస్తోంది. అంతే కాదు.. టీడీపీ ఎప్పుడూ రాజీనామాల పేరిట బెదిరించడం తప్పితే చేసింది లేదని ఎద్దేవా చేస్తోంది.

చంద్రబాబు సవాల్ పై ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. దమ్ముంటే.. ఆయన తన ఎంపీలతో రాజీనామా చేయించాలని సజ్జల సవాలు విసిరారు. రాజీనామాలకు వైసీపీ ఎంపీలు ఎప్పుడూ భయపడరని.. గతంలో ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసిన విషయం మరచిపోకూడాదని సజ్జల గుర్తు చేశారు. రాష్ట్రానికి సంబంధించి ఏ చిన్న అంశం వచ్చినా కూడా చంద్రబాబు, టీడీపీ నేతలు రాజీనామాల సవాల్ విసురుతారని.. కానీ.. వాళ్లు రాజీనామా చేస్తానంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు.

టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలనుకుంటే చేయవచ్చని.. గతంలో వైసీపీ ఎంపీలు ఆ పని చేసి చూపించారని సజ్జల అంటున్నారు. అంతే కాదు.. వైయస్‌ఆర్‌సీపీలోకి రావాలంటే వేరే పార్టీ వాళ్లు రాజీనామా చేసి రావాలని ఒప్పించి చేర్చుకున్నామని కూడా సజ్జల ఉదాహరణలతో వివరించారు. గతంలో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి ఆమోదించుకున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

విపక్షంలో ఉన్నప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చని.. గతంలో తాము విపక్షంలో ఉన్నప్పుడు అలాగే చేశామని సజ్జల అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడుతుంటే వైయస్‌ జగన్‌ గతంలో జలదీక్ష చేశారని.. అంతే కానీ.. చంద్రబాబును దీక్షకు పిలవలేదని గుర్తు చేశారు. చంద్రబాబు వైసీపీకి సవాలు విసిరే బదులు ఆయన ఎంపీలతో రాజీనామా చేయించాలని సూచించారు సజ్జల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: