ఆ విషయంలో.. వై.ఎస్‌. అడుగు జాడల్లోనే జగన్..?

పేదోడికి అండగా నిలిస్తే అధికారం ఖాయం.. ఎందుకంటే ఈ దేశంలో పేదోళ్లే ఎక్కువ. గతంలో వైఎస్ అనుసరించిన ఫార్ములా ఇది. ఇప్పుడు జగన్ కూడా దీన్నే ఫాలోఅవుతున్నాడు . ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో ఆనాటి వైఎస్‌ ముద్ర కొనసాగిస్తున్నాడు జగన్. ఆరోగ్య శ్రీతో వైఎస్‌ అపరిమితమైన ఖ్యాతి సంపాదించుకుంటే ఇప్పుడు జగన్ కూడా ఆరోగ్య రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు.

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సేవల్లో ఘననీయమైన మార్పులు తెచ్చారు. ఈ రోజు 2436 వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి.  వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అన్ని సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ఆపరేషన్‌ అయ్యాక విశ్రాంతి సమయంలో కూడా వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు రూ.5 వేలు పరిహారం ఇస్తున్నారు. దృష్టిలోపాలు ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయించి, కంటి  అద్దాలు కూడా అందజేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కాంక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించే పరిస్థితిలోకి తీసుకువచ్చారు. క్యాన్సర్‌ వంటి చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు.
 
130 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యేవారికి తోడుగా ఉండేందుకు పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. కోవిడ్‌ నుంచి కోలుకునేందుకు ఈ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. కోవిడ్‌ తరువాత కొత్త కొత్తగా వస్తున్న ఫంగస్‌లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా రెండేళ్లలో రూ.5215 కోట్లు చెల్లించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 9710 పోస్టులు పూర్తిగా భర్తీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1180 ఒకేసారి 108 వాహనాలు అందజేశారు. నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు  మారుస్తున్నారు. దాదాపు రూ.16300 కోట్లు ఇందుకు ఖర్చు చేస్తున్నారు.  ఇందులో భాగంగా 10, 111 విలేజి క్లినిక్స్‌ తీసుకువస్తున్నారు.  మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నారు. మరో 176 కొత్త పీహెచ్‌సీలు, 52 ఏరియా ఆసుపత్రులు, 192 కమ్యూనిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా 14 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: