ఎడిటోరియల్ : జగన్ టార్గెట్ అవ్వడానికి కారణాలేన్నెన్నో ?
ఒకరకంగా వైసిపి ప్రభుత్వం సైతం ఈ పరిణామాలతో కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అకస్మాత్తుగా విగ్రహాల సంఘటనలు చోటు చూసుకోవడం, మూడు పార్టీల నాయకులు జగన్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక కారణాలు ఇవే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మామూలుగా జనం కోణం నుంచి చూస్తే, ఏపీ సీఎం జగన్ అడగకుండా దేవుడిలా కనిపిస్తున్నారు. ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు వంటి వ్యవహారాలపై దృష్టి పెట్టి అందరికీ అన్ని రకాలుగా మేలు చేస్తూ, జనాల గుండెల్లో పాతుకు పోయాడు. ఇదే స్పీడ్ తో జగన్ ముందుకు వెళ్తే, రాబోయే రోజుల్లో ఆయన దూకుడు ఎదుర్కోవడం కష్టం అనే విషయం అన్ని పార్టీలకు అర్థం అయిపోయింది.
ఇప్పుడు బిజెపి, జనసేన, టిడిపి దాడి ప్రారంభించడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తోంది. అదీ కాకుండా జగన్ ను ఎదుర్కోవడానికి విడివిడిగా వెళ్తే లాభం లేదని, 2014లో మాదిరిగా మూడు పార్టీలు కలిసి జగన్ అధికారం నుంచి దూరం చేయవచ్చని అభిప్రాయంలో ఆయా పార్టీల అధినేతలు ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉండడంతో, ఇప్పటి నుంచి అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే అవకాశం ఉండదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉన్నా, ఎన్నికల సమయం నాటికి అవసరమైతే సోము వీర్రాజు ను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పించాలనే ఆలోచనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి ,బిజెపి , జనసేన పార్టీలు కలవడం ద్వారా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ఎక్కువగా నమ్ముతూ ఉండడంతో ఈ విధంగా జగన్ అందరికీ టార్గెట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.