హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎగ్జిట్ పోల్స్ తేజస్వికే ఎందుకు పట్టం కట్టాయో తెలుసా ?
ఇదే సమయంలో ప్రత్యర్ధి ఎన్డీయే ఎంత గట్టిగా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కు మద్దతుగా రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపిలతో పాటు ఇతర రాష్ట్రాల నేతలంతా ఎన్డీయేకి మద్దతుగా బీహార్ లోనే దాదాపు నెలరోజులుగా మోహరించారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా ఎన్నికల ప్రచార సభల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇది కాకుండా ఇంకోవైపు శివసేన, మరోవైసు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటి పడ్డాయి. వీళ్ళంతా చాలరన్నట్లుగా దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, మరో రెండు కూటములు అధికారం కోసం పోటి పడ్డాయి. మరి ఇంతమంది ప్రత్యర్ధులను తట్టుకుని తన కూటమిని గెలుపు గుర్రం ఎక్కించాలంటే ఎవరికైనా మామూలు విషయం కాదు.
అందుకనే తేజస్వి విషయమై అన్నీ మీడియా సంస్ధలు, సర్వే సంస్ధలు ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించాయి. మొదటి విడత పోలింగ్ కాగానే మెజారిటి సీట్లు ఎంజీబీకే దక్కుతాయని తేలింది. అలాగే రెండోదశ పోలింగ్ లో కూడా ఎన్డీయే కూటిమికి ఆశించిన ఫలితాలు దక్కటం లేదని తేలిపోయింది. ఇక తాజాగా అంటే శనివారం మూడోదశ పోలింగ్ జరిగిన తర్వాత ఓటర్లనాడి తెలియగానే ఎగ్జిట్ పోల్స్ లో ఎంజీబీకే పట్టం అని ప్రకటించేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 243 అసెంబ్లీ సీట్లలో ఎంజీబీ కంఫర్టబుల్ గా 124 సీట్లతో అధికారంలోకి వస్తుందట. టైమ్స్ నౌ-సీ ఓటర్ ప్రకారం ఎన్డీయేకి 116, ఎంజీబీకి 120 సీట్లొస్తాయి. పీపుల్స్ పల్స్-పీఎన్జీ ప్రకారం ఎంజీబీ కూటమికి 125 సీట్లు వస్తాయట. ఇక ఎన్డీయే కూటమికి 110 సీట్లొస్తాయి. చివరకు బీజేపీకి మద్దతుగి నిలబడే రిపబ్లిక్ టీవీ కూడా ఎంజీబీకి 138 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదే సమయంలో ఎన్డీయేకి 117 రావచ్చని తేల్చేసింది.