ఎడిటోరియల్ : కేసీఆర్ కు ఏమైంది ? టిఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ గురించి ఎంత చెప్పినా, తక్కువే. వ్యూహాలు ,ప్రతి వ్యూహాలు రచించడంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు, ఆ పార్టీ లో ఉన్న హరీష్ రావు, కేటీఆర్ ,  కవిత చాలామంది సమర్థులు ఉన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో తగిన నిర్ణయాలు తీసుకుంటూ , పార్టీ కి క్రేజ్ తీసుకురావడం ఒక సక్సెస్ అవుతూ వచ్చారు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చూసుకుంటే,  టిఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలు చాలానే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయి వరకు తీసుకువెళ్లారు.  అంతవరకు  ఆందోళనలు , అల్లర్లు, వినతులు వేడుకోలు, ఇలా ఎన్నో చేశారు ఏదైతేనేం  చివరకు ప్రత్యేక తెలంగాణను సంపాదించారు మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని నమ్మకం కలిగించారు. 

ఎప్పటికప్పుడు సెంటిమెంటును రగిలిస్తూ పైచేయి సాధించడం లో ప్రభుత్వం సక్సెస్ అవుతూ వచ్చింది. ఇక రెండో సారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు అదే రకమైన ఫలితాలు వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని, ఆ పార్టీ నేతలు బలంగా నమ్మారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దశలోనూ వివాదాస్పదం అవుతూ కొన్ని కొన్ని వివాదాస్పద నిర్ణయం తీసుకుంటూ, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం వంటి చోటు చేసుకుంటున్నాయి .ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణ రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కేటీఆర్ కి తెలంగాణ సీఎం బాధ్యతలు అప్పగించి,  ఇటీవల గెలిచిన పార్టీలోనూ, ప్రభుత్వంలోను పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా,  ఇప్పుడు తెలంగాణలోనూ వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. 



ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది. అసలు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపు పై టిఆర్ఎస్ కు అనుమానాలు కలుగుతున్నాయి . ఇక్కడ బిజెపి గట్టిపోటీ ఇవ్వడం తో, ఇక్కడ టిఆర్ఎస్ గెలుస్తుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితేే, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక నగరంలో గతంతో పోలిస్తే ప్రజావ్యతిరేకత పెరిగిపోవడం ,  ఇటీవల భారీ వర్షాల కారణంగా సాధారణంగానే టిఆర్ఎస్ పై వ్యతిరేకత అయితే, వెళ్ళిపోయింది. పార్టీ నాయకులు సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వస్తున్న తీరు టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.ప్రభుత్వంలోను, పార్టీ నాయకులలోను గతంతో పోలిస్తే , చిత్తశుద్ధి తగ్గడం, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం,  ఇలా ఎన్నో కారణాలు టిఆర్ఎస్ పార్టీ ని బలహీనం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. 



దీనికి తోడు కేసీఆర్ సైతం ఎక్కువగా ఫామ్ హౌస్ రాజకీయాలకే పరిమితమై పోతున్నారని ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చడం , ప్రజల్లో ఈ వ్యవహారాలపై చర్చ జరుగుతోంది. ఇలాంటివి ఎన్నో కారణాలు టిఆర్ఎస్  కు ఇబ్బందికరంగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: