చంద్రబాబూ.. కరంట్ ప్లగ్‌లో వేలు పెడితే షాక్ కొట్టకుండా ఉంటుందా..?

మరోసారి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఏకంగా 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఈ స్థాయిలో అక్కడ వరద రావడం చాలా అరుదు. మరి అంత వరద వస్తే చుట్టుపక్కల ఇళ్లు మునగకుండా ఉంటాయా.. అందులోనూ నదీ పరిమితులు అధిగమించి నదీ ఒడ్డుక కట్టిన చంద్రబాబు నివాసం  ఉంటున్న ఇల్లు మునగకుండా ఉంటుందా.. కానీ ఈ విషయాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బాబు గారు తన ఇల్లు ముంచేస్తున్నారని అంటున్నారు... కరెంట్ ప్లగ్ లో చెయ్యి పెట్టి షాక్ కొట్టకుండా ఉంటుందా..? ఒక రిజర్వాయిర్ లో అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటూ నువ్వే తప్పులు చేస్తూ నా కొంప ముంచుతున్నారని అనడం హాస్యాస్పదంగా ఉంది.. అంటూ చంద్రబాబును నిలదీస్తున్నారు  వైసీపీ నేత గడికోట శ్రీకాంత్‌ రెడ్డి.  ప్రభుత్వంపై ఎలా బురద జల్లాలి అనే దానిపైనే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని... మా ప్రభుత్వం వచ్చాక రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయని...రైతుల కళ్లలో ఆనందాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడుతున్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ కరకట్టపై అక్రమంగా నివాసం ఉంటూ ఇల్లు మునిగిందంటే ఎలా? ఎవరి ఇల్లు ముంచాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. 9లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్లే పలు ప్రాంతాలు నీట మునిగాయి. అమరావతిని ముంచాలనే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం శత్రువులకు కూడా అన్యాయం చేయదు. లోకేష్ పొలాల్లోకి దిగి ఫొటోలో దిగారు.. కనీసం వరి నాట్లు ఎలా ఉంటాయో కూడా తెలియని ఆయన  ఫోటోల కోసమే ఫోజులు ఇవ్వడం చేశారు. చంద్రబాబు హయాంలో కరువు వస్తే కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు.కానీ అప్పటి బకాయిలను కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అంటూ గుర్తు చేశారు శ్రీకాంత్‌ రెడ్డి.  

అంతే కాదు.. రాష్ట్రంలో రిజర్వాయిర్ లు నిండటంతో తండ్రీ కొడుకులు ఓర్వలేక పోతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వరదలపై చంద్రబాబు నిన్న మాట్లాడారు... ఆయన సీఎం అయ్యి ఉంటే గంట గంటకు టెలీకాన్ఫరెన్స్ చేసే వాడిని అంటూ మళ్లీ పాత పాటే పడుతున్నారు... వర్షాల వల్ల పంట నష్టం జరిగిన మాటమే నిజమే కానీ వారికి ఏ రకంగా సాయం చేయాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది అంటూ కౌంటర్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: