మంటలు పెట్టేయడమే.. 2024 ఎన్నికల వ్యూహం సిద్ధం చేసిన బాబు..!

రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే మాట్లాడాలి.. ఒకసారి ఎన్నికలు అంటూ పూర్తయ్యాక ఇక అభివృద్ధే ధ్యేయంగా రాజకీయం సాగాలి.. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాల జోలికి వెళ్లాలి.. ఇవీ ఒకప్పుడు చంద్రబాబు చెప్పిన నీతి సూక్తులు.. వాస్తవానికి ఇవి చాలా మంచి మాటలు. జరగాల్సింది అదే.. అయితే చంద్రబాబుకు ఈ వాక్యాలు కేవలం తాము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గుర్తొస్తాయి. మళ్లీ ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వ‌చ్చేస్తారో అప్పుడు ఇవన్నీ కన్వీనియంట్ గా మర్చిపోతారు. నిరంతరం రాజకీయమే చేస్తారు. ప్రతి అంశంలోనూ రాజకీయ లబ్ది మాత్రమే చూస్తారు.
ఇందుకు తాజా ఉదాహరణ.. అంతర్వేది రథం వివాదం. అంతర్వేదిలో రథం కాలిపోయింది. ఇందుకు కారణం ఎవరో తెలియదు. దీనిపై విపక్షంగా చేయాల్సిన రాద్దాంతమంతా చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాల రాజకీయం అర్థం చేసుకున్న జగన్ ఏకంగా సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశాలు ఇచ్చేసి ఒక్కసారిగా సీన్ రివర్స్ చేసేశారు. ఇక ఆ తర్వాత ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా దాన్ని హిందువులపై దాడిగా వర్ణిస్తూ చంద్రబాబు ప్రెస్ మీట్లు నిర్వహించేస్తున్నారు.
అయితే ఇష్యూని అక్కడితో వదిలేయకుండా.. ప్రతి చిన్న ఇష్యూని రాజకీయం చేసేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ.. అంతర్వేది నూతన రథ నిర్మాణ పనులను టెండర్లు పిలవకుండానే అప్పగించారని.. దీనివల్ల అగ్నికుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయని చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. రథాన్ని స్వామివారి ప్రతిరూపంగా భావించే  అగ్నికుల క్షత్రియులు.. 1823లో అంతర్వేది ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ కోసం1800 ఎకరాల భూమిని ఇచ్చారన్న సంగతి మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు.
అంతర్వేది ఆలయ నిర్మాణం చేసిన అగ్నికుల క్షత్రియులే రథ మరమ్మతులు, నిర్వహణతో పాటు, రథానికి తొలి కొబ్బరికాయ కొట్టడం, రథాన్ని లాగడం 200 ఏళ్లుగా చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. రథ నిర్మాణం విషయంలో తమ ప్రతిభను గుర్తించలేదంటోన్న వారి బాధను ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణమే స్పందించాలని చంద్రబాబు కోరుతున్నారు. సో.. చంద్రబాబు డిసైడైపోయినట్టున్నారు.. ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా మతం, కులం కార్డులు వాడేసేయాలని.. అదే మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందని.. చంద్రబాబు డిసైడ్ అయినట్టున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: