హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ వ్యూహంలో చంద్రబాబు పూర్తిగా ఇరుక్కుపోయాడా ?
ఇక్కడే జగన్ వేసిన ట్రాప్ లో చంద్రబాబు పూర్తిగా ఇరుక్కుపోయాడనే అర్ధమవుతోంది. రాయలసీమలో హైకోర్టు అన్నది దశాబ్దాల డిమాండ్. ఇక ఉత్తరాంధ్రలోని వైజాగ్ ప్రాంతంలో రాజధాని అన్నది పూర్తిగా జగన్ కొత్త వ్యూహమే. శాసన రాజధానిగా అమరావతి కంటిన్యు అవుతుందని జగన్ ప్రకటన చేశాడు. నిజానికి రాజధానిగా వైజాగ్ ను ఎంపిక చేయటంలో జగన్ చాలా వ్యూహత్మకంగానే వ్యవహరించాడు. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భవిష్యత్తులో కూడా మళ్ళీ టిడిపి తలెత్తకుండా ఉండాలంటే గట్టిగా ప్లాన్ చేయాలన్నదే జగన్ ఆలోచన. అందుకనే అన్నీరకాలుగా ఆలోచించే వైజాగ్ ను రాజధానిగా జగన్ ప్రకటించాడు. జగన్ ఆలోచనను ముందు అర్ధం చేసుకోవటంలో ఫెయిల్ అయిన చంద్రబాబు అమరావతి కోసమే ఉద్యమాలు లేవదీశాడు.
వైజాగ్, కర్నూలుకు వ్యతరిరేకంగా పార్టీలో తీర్మానాలు చేయించటమే కాకుండా రాష్ట్ర మంతా ఉద్యమం పేరుతో పర్యటించాడు. సరే కరోనా వైరస్ కారణంగా పర్యటనలు, ఉద్యమాలు అర్ధాంతంగా ఆగిపోయాయి. అమరావతి నుండి రాజధానిని తరలించాలనే ప్రకటనకు ముందే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భవిష్యత్తులో వైసిపి పరిస్ధితి ఏమిటి ? అనే విషయాలపై జగన్ పెద్ద ఎత్తున కసరత్తు చేశాడు. రెండు జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాలపై ఆశలు వదిలేసుకున్నాడు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు వ్యతరికేత కారణంగా వైసిపికి పై రెండు జిల్లాల్లో కూడా అత్యధిక సీట్లు వచ్చాయి. అయితే 2024లో కూడా ఇన్నే సీట్లు వస్తాయన్న గ్యారెంటీ ఏమీలేదు. అందుకనే ప్లాన్ బిని అమలు చేశాడు.
ప్లాన్ బిలో భాగంగానే రాజధానిని వైజాగ్ తీసుకెళ్ళిపోవటం. ప్లాన్ బిని అమలు చేయటంలోనే చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించేశాడు జగన్. కారణాలేవైనా కానీండి చంద్రబాబేమో పై రెండు జిల్లాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి కోసం ఉద్యమాలు చేస్తున్నాడు. రాజధాని అమరావతిలోనే ఉండాలని, హైకోర్టు కూడా కర్నూలుకు తరలించేందుకు వీల్లేదని ఉద్యమాలు చేయటంతో పై ప్రాంతాల్లో చంద్రబాబు విలన్ అయిపోయాడు. అంటే రెండు జిల్లాల కోసం చంద్రబాబు 11 జిల్లాలోని జనాలతో సున్నం పెట్టుకున్నాడు. అదే సమయంలో రెండు జిల్లాలను వదులుకునేందుకు రెడీ అవటం ద్వారా జగన్ 11 జిల్లాల్లో మంచి మార్కులు సంపాదించుకున్నాడు. అంటే మిగిలిన నాలుగేళ్ళల్లో జగన్ మార్క్ పాలన ద్వారా వైజాగ్ లో రాజధాని పెట్టడం ద్వారా అభివృద్ధిని చూపించగలగాలి. అదే సమయంలో హైకోర్టు పెట్టడం ద్వారా యావత్ రాయలసీమను కూడా డెవలప్ చేయాలి.