హెరాల్డ్ సెటైరికల్: భగ్న ప్రేమికుడిగా మారిన బాబోరు... ఈ గాయానికి మందేలేదా...!
అదేంటి.. నిత్యం ప్రశాంత చిత్తంతో చిరు మందహాసంతో.. తాను పుట్టింది, పెరిగింది.. పెరగబోయేది, తి న్నదీ తింటున్నదీ.. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన అని చెప్పే చంద్రబాబుకు భగ్న హృదయ మా? అని కొందరు తమ్ముళ్లు నోళ్లు వెళ్లబెట్టారు. ఇక, ఈ వార్త అనుకూల మీడియా ప్రచారం కంటే రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్ల చెవుల్లో మార్మోగిపోయింది. వెంటనే రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు ఏమైంది? మా బాబు కు ఏమైంది? అంటూ ఫోన్లు, వాట్సాప్ మేసేజ్‌లు పోటెత్తాయి. తీరా విషయం తెలుసుకున్నాక.. తమ్ముళ్లు కూడా భగ్న హృదయం బరువెక్కిందని రివర్స్ మెసేజ్‌లు పెట్టారట!
అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి.. అన్నట్టుగా మారిందట చంద్రబాబు పరిస్థితి. గత ఏడాది ప్రజలు ఓడించారు. ఈ బాధే పోలేదు.. ఇప్పుడు తాను నమ్మిన.. తనను నమ్మిన తమ్ముళ్లు ఓడిస్తున్నారు. అదీ ఎన్నికల వేళ.. కలలోనైనా పార్టీ వీడరనుకున్న వారే .. పార్టీని వీడి వెళ్లి.. మాటల తూటాలతో తనను చెండాడుతుంటే.. బాబు హృదయం భగ్గుమంటోందట! జగన్ పాలనపై తానెత్తిన పిడికిలిలో బలం తగ్గి.. జనమంతా జగన్ జగనంటూ.. జనమెత్తిన గళం విని చంద్రన్నకు హృదయం భగ్నమైందట! స్థానిక ఎన్నికలు వాయిదా తన పార్టీకి సెలైన్ నింపుతుందనుకున్నా.. సుప్రీం దెబ్బతో సర్కారు కు గేట్లెత్తడం బాబు మైండ్‌ను బ్లాక్ చేసిందట! ఇదే ఇదే.. ఇప్పుడు బాబుగారి గుండెల్లో గాయం చేసిందట! మరి ఈ బాధ తీరేదెన్నడు.. తీర్చేదెన్నడు?.. అంతా జగన్మాయ!