కూతుళ్లపై తండ్రి కర్కశత్వం..వీడియోను తల్లికి పంపి డబ్బు పంపాలంటూ బెదిరింపులు.
భర్త ప్రతి నెలా పంపిస్తున్న డబ్బుతో జల్సాలు చేస్తున్నాడని భార్యకు తెలియడంతో.. ఆమె ఎలీషాతో మాట్లాడటం మానేసింది. కొద్ది రోజులుగా డబ్బు కూడా పంపించకపోవడంతో అతడు భార్యపై కోపం పెంచుకున్నాడు. ఆమె ఏమీ చేయలేక.. ఇద్దరు కూతుళ్లను టార్చర్ పెట్టాడు. ఇద్దరిని కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. పిల్లల్ని కొడుతూ వీడియో రికార్డ్ చేసి.. తన భార్యకు పంపి డబ్బు పంపాలని బెదిరించాడు. ఇద్దరు చనిపోతామని వీడియోలో బలవంతంగా చెప్పించాడు.
ఈ వీడియోలో సోషల్ మీడియాకు చేరడంతో.. ఎలీషా దుర్మార్గం బయటపడింది. స్థానికులు కొందరు ఇద్దరు పిల్లల్ని రక్షించగా.. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న ఎలీషా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని బంధువులకు అప్పగించారు. గల్ఫ్‌లో ఉన్న ఎలీషా భార్యకు సమాచారం అందించేందుకు సిద్ధమయ్యారు