Jobs: LIC నుంచి భారీ రిక్రూట్మెంట్?

Purushottham Vinay
ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ ఏఏఓ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా మొత్తం 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తోంది.వీటికి అర్హులైన అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఎల్ఐసీ ఏఏఓ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ఎలాగంటే..ముందుగా అభ్యర్థులు ఎల్ఐసీ ఇండియా వెబ్‌సైట్ ని విజిట్ చెయ్యాలి.ఇక అక్కడ హోం పేజీలో కెరీర్స్ లింక్ అనేది ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే అది మరో పేజీకి తీసుకెళుతుంది.ఇక అక్కడ మీరు ఏఏఓ రిక్రూట్మెంట్ 2023 లింక్‌ను క్లిక్ చేయాలి.ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది.ఇక మీరు అక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ని నింపాలి. అక్కడ అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.ఇక అప్లికేషన్ ఫీజు చెల్లించడంతో అప్లై చెయ్యడం పూర్తవుతుంది.


భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారం ప్రింట్ ని తీసిపెట్టుకోండి.లేదా పీడీఎఫ్ రూపంలో మీ మొబైల్ లో కానీ పీసీలో కానీ సేవ్ చేసి పెట్టుకోండి.ఇంకా ఎల్ఐసీ ఏఏఓ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది జనవరి 15, 2023న ప్రారంభమైంది. జనవరి 31, 2023 దాకా ఇది అందుబాటులో ఉంటుంది. ఇక పరీక్ష సమయానికి 10 రోజుల ముందు కాల్ లెటర్ ని పంపిస్తారు.ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 20 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష అనేది ఉంటుంది.ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఇక ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.విద్యార్హత విషయానికి వస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఖచ్చితంగా ఉండాలి.ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే..అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల ఎంపిక మూడు అంచెల ప్రక్రియగా ఉంటుంది. ఇక దీనికి ప్రీరిక్రూట్‌మెంట్ మెడికల్ పరీక్ష కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: