హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్-HECL లో 164 ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!

Kothuru Ram Kumar
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి శుభవార్త. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే, జార్ఖండ్ రాజధాని రాంచీ లో ఉన్న ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పరంగా మొత్తం 164 ట్రైన్ ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

సి టి ఎస్ స్కీం లో భాగంగా 2020 -21 2020 -22 సంవత్సరం కోసం మొత్తం 164 ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలై పోయింది. ఆగస్టు 29 ఇది చివరి తేదీ. ఈ ఉద్యోగాల భర్తీ కోసం వెబ్ సైట్ ను చూడగలరు. నోటిఫికేషన్ లోని ఉద్యోగాల దరఖాస్తులకు ఈ వెబ్ సైట్ లో ఉండే దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకుని పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు.

ఈ నోటిఫికేషన్ పరంగా.. ఫిట్టర్ 40 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 20 పోస్టులు, మెషిన్ లిస్ట్ 16 పోస్టులు, వెల్డర్ 40 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ 48 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇందుకు సంబంధించి 2020 జూలై 31 నాటికి వారి వయసు వయో పరిమితి 14 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక రిజర్వేషన్ సంబంధించి వివిధ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు కలిగించింది. దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ బి సి వారికి రూ 750 గా నిర్ణయించారు. అలాగే ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఎలాంటి ఫీజును తీసుకోవట్లేదు. ఇక ఆన్లైన్లో దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని అందులో అవసరమైన వాటిని జోడించి చివరగా వాడిని దయచేసి ఈ అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా.... ప్రిన్సిపాల్, HEC ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ప్లాంట్ ప్లాజా రోడ్డు, దుర్వా, రాంచీ, జార్కండ్ - 834004 కు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ను పూర్తిగా చదివి ఎవరైతే అర్హులు ఉంటారో వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: