నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. రైల్వేలో జాబ్స్‌కి మరో నోటిఫికేషన్..

Kavya Nekkanti

ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించి ఉద్యోగాలు లేక ఎంద‌రో యువ‌త రోడ్డున ప‌డుతున్నారు. అయితే రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి కోసం వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇటీవ‌ల వెస్టర్న్ రైల్వేలో భారీగా పోస్టుల్ని భర్తీ చేసింది. మొత్తం 3,553 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్న సంగ‌తి తెలిసింది. ఇదిలా ఉంటే.. తాజాగా భారతీయ రైల్వేలో వేర్వేరు విభాగాల్లో, వేర్వేరు కోటాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆగ్నేయ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. 

 

అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడల్లో ప్రతిభ చూపించినవారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 13 చివరి తేదీ. www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌సీ బిలాస్‌పూర్ స్పోర్ట్స్ కోటా లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి. పోస్టుల ఖాళీల వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు- 26. అందులో.. అథ్లెటిక్స్ (పురుషులు)- 1, అథ్లెటిక్స్ (మహిళలు)- 1, బ్యాడ్మింటన్ (పురుషులు)- 2, బ్యాడ్మింటన్ (మహిళలు)- 2బాస్కెట్ బాల్ (పురుషులు)- 2, బాస్కెట్ బాల్ (మహిళలు)- 2, బాక్సింగ్ (మహిళలు)- 3 ఖాళీలు ఉన్నాయి.

 

వీటితో పాటు క్రికెట్ (పురుషులు)- 4, హ్యాండ్‌బాల్ (మహిళలు)- 3, హాకీ (పురుషులు)- 3, కబడ్డీ (పురుషులు)- 1, ఖో ఖో (పురుషులు)- 1, వాలీబాల్ (పురుషులు)- 1, పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే విద్యార్హత.. నాన్ టెక్నికల్ పోస్టుకు 12వ తరగతి, టెక్నికల్ పోస్టుకు 10వ తరగతితో పాటు ఐటీఐ. వయస్సు.. 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ఇక ముఖ్య తేదీల విష‌యానికి వ‌స్తే.. దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 14, దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 13 ముఖ్య తేదీలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: