గ్రేట్‌ చంద్రబాబు.. సీబీఐనే నడిపిస్తున్నారా?

చంద్రబాబు నాయుడే సమర్థమంతమైన నాయకుడు అని ప్రతిపక్షంలో ఉన్న కూడా సీబీఐని నడపగల సత్తా ఉన్న వ్యక్తి అని వైసీపీ పార్టీ నాయకులే చెబుతున్నారు. టీడీపీ వారు చెబితే దానికి ఒక అర్థం ఉంది. కానీ వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వారిపై ఇలా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. ప్రధాన అంశం ఏమిటంటే ఏదైనా కేసులో ఏ కోణంలో నుంచి ఏ కోణంలో కి వెళ్లాలనేది ఎల్లో మీడియా చేస్తున్న విధంగా విచారణ జరుగుతుందనేది తెలుస్తోంది.ప్రజల్లో పాజిటివ్ వచ్చినపుడు దర్యాప్తు సంస్థలకు విచారణ ఈజీగా అవుతుంది. అయితే ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఏమేం లోటు పాట్లు ఉన్నాయనే వివరాలను సీబీఐ అధికారుల నుంచి ఆ ప్రధాన మీడియా రహస్యంగా సేకరిస్తుంది. ఏ రోజు ఎలా ఎక్కడ విచారించే అవకాశం ఉందని ముందుగానే చెబుతుంది. మళ్లీ విశ్వసనీయ వర్గాల సమాచారం అని తెలుపుతుంది. ఎందుకంటే సీబీఐని ఉపయోగించుకోవడంలో చంద్రబాబు టీడీపీ పార్టీ కి ఉన్నంత వైసీపీ నాయకులకు లేనట్లే తెలుస్తోంది. తద్వారా ఆ కోణంలో వారే విచారణ జరిపినట్లు తెలుపుతారు.ఈనాడు రామోజీరావు విషయంలో కూడా ఇలాగే కొడుకుతో విబేధాలు జరిగినపుడు సాక్షికి రామోజీ కొడుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంధ్రజ్యోతికి ఇస్తే దాన్ని టెలికాస్ట్ చేయరు. కాబట్టి ఎవరికి సమాచారం ఇవ్వాలో వారికే ఇచ్చారు. సీబీఐ సమాచారం ముందుగా ఈ మీడియాకు చేరవేస్తోంది. సీబీఐ డైరెక్టర్ టీడీపీ వారికి అనుచరుడుగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డైరెక్టర్ వెళ్లిపోయాడు. ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ నే అదుపులో పెట్టారంటే మామూలు వ్యక్తి చంద్రబాబు కాదని వైసీపీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి దర్యాప్తు విషయాల్లో ఆయనతో జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: